పాములకు ఇష్టమైన పూలు ఇవే.. వాసనకే మైమరిచిపోతాయంట!

samatha

27 April 2026

పాములకు సంబంధించిన ఈ ఏ న్యూస్ అయినా సరే చాలా మంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. పాములంటే భయం ఉన్నా, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతారు.

పాములు

అయితే పాములకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల పూలు అంటే పాములకు చాలా ఇష్టం అని చెబుతుంటారు.

పాములకు ఇష్టమైన పూలు

ముఖ్యంగా మన పెద్దవారు అయితే ఇంటి వద్ద కొన్ని రకాల పూల మొక్కలను అస్సలే పెంచనివ్వరు, పాములు వస్తాయంటూ, వాటిని తీసి వేస్తుంటారు.

పూలు

మరి అసలు ఏ రకమైన పూలు అంటే పాములకు అమితమైన ఇష్టం ఉంటుంది. ఏ రకం ఫ్లవర్స్ వాటిని ఇంటి వద్దకు వచ్చేలా చేస్తాయో, పాముల ఫేవరెట్ పూలు ఏవో చూసేద్దాం.

పాములు

బపాములకు ఎక్కువగా సువాసన వచ్చే పూలు అంటే చాలా ఇష్టం ఉంటుందంట. ముఖ్యంగా నాగుపాముకు సువాసన వచ్చే పూలు చాలా ప్రీతికరం.

సువాసన వచ్చే పూలు

అందులో మల్లెపూలు అంటే పాములకు చాలా ఇష్టం ఉంటుందంట. అందుకే మల్లెపూల వాసన ఎక్కడ వస్తే అక్కడికి పాములు వెళ్లిపోతాయని చెబుతుంటారు.

మల్లెపూలు

అదే విధంగా మొగలిపువ్వు అంటే కూడా పాములకు చాలా ఇష్టం. ఈ చెట్టు కూడా దట్టంగా, మంచి సువాసనతో ఉండటం వలన ఇక్కడ పాములు ఎక్కువగా ఉంటాయంట.

మొగలి పువ్వులు

అలాగే సంపెంగ పూలు నాగుపాముకు, ఇతర పాములకు చాలా ఇష్టం. ఈ చెట్టు ఉన్న దగ్గర తప్పకుండా నాగు పాము ఉంటుందని చెబుతుంటారు కొందరు.

సంపెంగ పూలు

 అదే విధంగా తెల్ల కలువ పూలు, గన్నేరు పూలు, ఛామంతి వంటి పూలు ఇష్టం ఉంటుందంట. నోట్ : ఈ సమాచారం కేవలం నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

తెల్ల కలువలు