Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 965 పాజిటివ్ కేసులు..
Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది...
Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 965 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,09,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1706 మంది మృతి చెందారు.
తాజాగా కరోనా నుంచి కోలుకుని 312 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 3,01,876 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 6,159 మంది యాక్టివ్‌లో ఉండగా, 2,622 మంది హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 97.46 శాతం ఉండగా, దేశంలో 93.7శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 254 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 110 నమోదయ్యాయి.
ఇవీ చవవండి: India Corona Cases Updates: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు..
Night Curfew in Telangana: తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ.. సోషల్ మీడియాలో హల్‌చల్.. ఇది నిజమేనా?