Telangana Corona Cases: తెలంగాణలో 2,070 పాజిటివ్ కేసులు నమోదు.. 18 మంది మృతి..
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 1.38 లక్షల శాంపిల్స్ సేకరించి...
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 1.38 లక్షల శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,89,734 లకు చేరుకుంది. ఇదే సమయంలో 3,762 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక మొత్తంగా కరోనా రికవరీల సంఖ్య 5,57,162 లకు చేరుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,364 కి చేరింది. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో రికవరీ రేటు 94.47 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 7వ తేదీన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ కేంద్రాలలో కోవిడ్ 19 పరీక్షలతో సహా ఇతర 57 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 19 జిల్లాల్లో ఏర్పాటు చేస్తుండగా.. తరువాత కాలంలో మరికొన్ని జిల్లాల్లోనూ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Also read: