Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

Chiru-TRS Mla: టాలీవుడ్ సూపర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కొందరి వాడు కాదు.. అందరివాడు అంటారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలు వేరు.. స్నేహం వేరు అని అంటారు...

Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన
Chiru Trs Mla
Follow us

|

Updated on: Jun 05, 2021 | 9:13 PM

Chiru-TRS Mla: టాలీవుడ్ సూపర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కొందరి వాడు కాదు.. అందరివాడు అంటారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలు వేరు.. స్నేహం వేరు అని అంటారు. చిరంజీవి తెలుగు పరిశ్రమలోని నటీనలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ నాయకులతో సత్ సంబంధాలున్నాయి. సీఎం కేసీఆర్ కూతురు కవిత స్వయంగా తాను మెగాస్టార్ చిరంజీవికి అభిమానినని తెలిపారు. కరోనా కష్ట కాలం మొదలైనప్పటి నుంచి సినీ సెలబ్రెటీలు తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలోని కార్మికులకు అండగా ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వారికి నిత్యావసర వస్తువులను అందించారు. ఇక వ్యాక్సినేషన్ కూడా వేయించారు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా చిరంజీవి మౌనంగా తాను చేయాల్సిన సాయం చేస్తూ.. ప్రజలకు అండగా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలెండర్లు అందజేస్తూ.. కరోనా బాధితుల ప్రాణాలను కాపాడుతున్నారు.

ఆపన్న సమయంలో తన అభిమానులకు అండగా నిలబడే చిరంజీవి ఓ తెలంగాణ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పలకరించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చిరంజీవి చెప్పారని శంకర్ నాయక్ తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లను పంపించారని.. ఈ సందర్భంగా తనకు ఫోన్ చేసి చిరంజీవి మాట్లాడారని తెలిపారు. ప్రజల్లో తిరుగుతున్నారు.. బయట పరిస్థితులు బాగోలేదు.. జాగ్రత్తగా ఉండాలని చిరు సూచించారని తెలిపారు శంకర్. అంతేకాదు..ఈ సందర్భంగా తాను కోరిన వెంటనే జిల్లాకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లు అందించినందుకు చిరంజీవికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కృతజ్ఞతలు చెప్పారు.

Also Read: మల్లన్న కలలో కనిపించాడంటూ పొలంలో తవ్వకాలు.. బంగారు విగ్రహం లభ్యం.. ఆపై