Actor Sonu Sood: ఏడాది చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూ సూద్
Actor Sonu Sood: ప్రముఖ నటుడు సోనూ సూద్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నుంచి ఆపన్నులను ఆదుకుంటూ వస్తున్న సోనూ సూద్ సాయం..
Actor Sonu Sood: ప్రముఖ నటుడు సోనూ సూద్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నుంచి ఆపన్నులను ఆదుకుంటూ వస్తున్న సోనూ సూద్ సాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరికీ కష్టం వచ్చినా ముందుగా చూసేది సోను వైపే అనడంలో అతిశక్తి లేదు. సెలబ్రెటీలు కూడా సోనూ సూద్ ను సాయం కోరుతున్నారు. తాజాగా మరోసారి సోను తన దాతృత్వాన్ని .. చాటుకున్నాడు. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న ఏడాది వయసు చిన్నారి ప్రాణాలను సోనూసూద్ కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్దిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి అండగా నిలిచాడు. . రాజాపురం గ్రామానికి చెందిన భాస్కరరావు, సత్య దంపతులకు ఏడాది వయసున్న తేజాకృష్ణ కుమారుడున్నాడు. భాస్కరరావు ఆటో నడుపుతుంటారు. అదే వారి కుటుంబానికి జీవనాధారం. అయితే ఏడాది వయసున్న తేజకు గుండె జబ్బని.. ఆపరేషన్ చేయాలనీ వైద్యులు చెప్పారు. దీంతో కొడుకు తేజని బతికించుకోవడం కోసం తమ ఆర్ధిక పరిస్థితికి మించి ఖర్చు పెట్టారు. ఈ విషయం జన విజ్ఞాన వేదిక సోషల్ మీడియా లో షేర్ చేసింది. చిన్నారి బాలుడుని ఆదుకోవాలంటూ పిలుపునిచ్చింది. ఈ విషయం సోను సూద్ వద్దకు చేరుకుంది. వెంటనే స్పందించిన సోనూ స్పందించారు. తేజకు వైద్యం చేయించే బాధ్యతను తీసుకున్నారు. చిన్నారి చికిత్స కోసం తల్లిదండ్రులను ముంబయి రప్పించి.. అక్కడి ఎస్‌ఆర్‌సీసీ పిల్లల ఆసుపత్రిలో గురువారం రోజు శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి తేజాకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది.
చిన్నారికి వైద్యం చేయించి తల్లిదండ్రులకు అండగా నిలిచిన సోను సూద్ మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తేజను కాపాడి ఆ కుటుంబానికి సోనూ సూద్ దేవుడుగా మారాడు. దిక్కులేని పరిస్థితిలో దంపతులకు అండగా నిలిచిన ఆ రియల్ హీరో సోను అంటూ బాధితుల బంధువులు, స్నేహితులు జేజేలు పలుకుతున్నారు .సోనూ చేసిన సేవలను సాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన