Telangana: బీఎల్ సంతోష్, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాల్సిందే.. షాకింగ్ కామెంట్స్ చేసిన జగ్గారెడ్డి..

అటు లిక్కర్‌ స్కామ్‌.. ఇటు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రస్తుతం ఉన్న సమాచారం, ఆధారాలకు అనుగుణంగా లిక్కర్‌ స్కామ్‌లో

Telangana: బీఎల్ సంతోష్, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాల్సిందే.. షాకింగ్ కామెంట్స్ చేసిన జగ్గారెడ్డి..
Jaggareddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 02, 2022 | 9:34 PM

అటు లిక్కర్‌ స్కామ్‌.. ఇటు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రస్తుతం ఉన్న సమాచారం, ఆధారాలకు అనుగుణంగా లిక్కర్‌ స్కామ్‌లో కవిత, అటు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీఎల్‌ సంతోష్‌ ఇద్దరూ నేరస్తులే అన్నారు జగ్గారెడ్డి. వాళ్లద్దిరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు జగ్గారెడ్డి. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకరికి ఒకరు దొంగలు అనుకుంటున్నారని విమర్శించారు. కవిత, బీఎల్ సంతోష్ వార్తలు చూస్తే వారేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. కవిత మీద లిక్కర్ కుంభకోణం కేసు, బీఎల్ సంతోష్ మీద ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. గమనిస్తే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ స్కామ్‌ల ప్రభుత్వాలేనని దుయ్యబట్టారు.

అటు కేంద్రంలోని బీజేపీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు పెట్టింది. అరెస్ట్ చేస్తామనే సందేశాన్ని పంపిందన్నారు. ఇటు కేసీఆర్ సర్కార్.. బీఎల్ సంతోష్‌పై ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కేసు పెట్టిందన్నారు. రెండు ప్రభుత్వాలు స్కామ్‌ల సర్కార్లే అని అన్నారు. కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరస్తులే అని, వారిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. తామేదో నీతిమంతులం అని బీజేపీ బిల్డప్ ఇస్తుందని, మోదీ, అమిత్ షా లు వెనుక ఉండి బీఎల్ సంతోష్‌ని ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు నడుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎల్ సంతోష్‌ను కాపాడటానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. సంతోష్ అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయన్నారు జగ్గారెడ్డి.

కవితకు భయం పట్టుకుంది.. అరెస్ట్ చేస్తే చేసుకోండని కవిత అంటున్నారని, కానీ, ఆమె లోపల భయం దాగుందన్నారు జగ్గారెడ్డి. బయటకు అరెస్ట్ చేయండి అని గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అరెస్ట్ చేస్తారనే భయం ఆమెలో ఉందన్నారు. కవితనే కాదు.. ఆ స్థానంలో తాను ఉన్నా భయం ఉంటుందన్నారు. సీబీఐ ఎంక్వైరీలో కవిత పేరు పెట్టారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాలని, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్‌ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ నేతలను కూడా బీజేపీ ట్రాప్ చేస్తోందని ఆరోపించారు జగ్గారెడ్డి. బిఎల్ సంతోష్, కవిత అరెస్ట్ అంశాలనే అజెండాలుగా తీసుకుంటామని, త్వరలోనే పార్టీ నాయకుల సమావేశం ఉంటుందన్నారు. బీఎల్ సంతోష్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కోర్టులను అడ్డుపెట్టుకుని బీఎల్ సంతోష్ బయటపడాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..