Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుని ఎంపికలో కొత్త ట్విస్ట్.. కన్నడ ఫార్ములాకు సోనియా గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుని ఎంపిక… అచ్చంగా తెలుగు డైలీ సీరియల్ని తలపిస్తోంది. రోజుకొక ట్విస్ట్‌తో సీన్ రక్తి కట్టినట్లుగానే టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడి ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లే వచ్చి..

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుని ఎంపికలో కొత్త ట్విస్ట్.. కన్నడ ఫార్ములాకు సోనియా గ్రీన్ సిగ్నల్!
Rahul Gandhi And Sonia Gandhi
Follow us

|

Updated on: Jun 06, 2021 | 7:52 PM

Telangana Congress new twist in president selection: తెలంగాణ పీసీసీ అధ్యక్షుని ఎంపిక… అచ్చంగా తెలుగు డైలీ సీరియల్ని తలపిస్తోంది. రోజుకొక ట్విస్ట్‌తో సీన్ రక్తి కట్టినట్లుగానే టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడి ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లే వచ్చి.. కొత్త ట్విస్ట్‌కు దారి తీసిందని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా మరో నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. సముద్రాన్నైనా ఈద వచ్చునేమో కానీ .. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంత ఈజీ కాదేమో అన్నట్లుంది వ్యవహారం చూస్తుంటే. మూడు, నాలుగేళ్లుగా అదిగో కొత్త పీసీసీ బాస్ అన్న ప్రచారమే తప్ప… నియామకం జరిగింది లేదు. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమిస్తారంటూ వారం రోజులుగా తెగ హడావుడి జరుగుతుంది. ఇక రేపో, మాపో పీసీసీ ప్రకటన ఉంటుందనుకుంటున్న దశలో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ పీసీసీ కుర్చీ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ కుర్చీ ఎక్కడం కోసం చాలా మంది.. చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్ని వర్గాల వారి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానానికి నివేదించారు. సీనియర్ నేతలు రంగ ప్రవేశం చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఠాగూర్.. మళ్లీ ఒక నివేదిక తయారు చేసి సోనియా గాంధీ ముందు పెట్టారట. అంతే.. ఈ విషయం తెలిసిన సీనియర్లు మళ్లీ తమ చేతికి పని చెబుతున్నారట. దీంతో ప్రతీ రోజూ ఏఐసీసీ కార్యాలయానికి, సోనియా గాంధీ నివాసానికి లేఖలు పోటెత్తున్నాయట. దీంతో మేడమ్ సోనియా గాంధీ.. కర్ణాటక వ్యూహాన్ని అమలు పరచాలని ఆదేశించారని గాంధీభవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా ఆదేశాలతో తెలంగాణ పీసీసీ ఎంపికను.. సేమ్ కర్ణాటక మోడల్ లో ప్రాసెస్ స్టార్ట్ చేశారట. తెలంగాణ మాదిరిగానే కర్ణాటకలో కూడా గ్రూపు తగాదాలు ఉండేవి. పార్టీలో ఉండే హేమాహేమీలందరూ అక్కడి వారే కావడంతో .. పీసీసీ ఎంపిక ప్రక్రియ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారేది. అదిష్టానం వద్ద అత్యంత పలుకుబడి కలిగిన సిద్దరామయ్య, పరమేశ్వర్ , మల్లిఖార్జున ఖర్గే , వీరప్పమొయిలీ, బీవీ పాటిల్, జైరామ్ రమేష్ తదితర సీనియర్ నేతలున్నారు. వీరిలో చాలా మంది డీకే శివకుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే కర్ణాటక లో కూడా పార్టీ లో కిందిస్థాయి తో పాటు మెజారిటీ డీసీసీలు డీకే శివకుమార్ ను కోరాయట. దీంతో అధిష్టానం.. తన దూతగా అభిప్రాయ సేకరణ కోసం సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ ని పంపిందట. ఆయన కూడా పూర్తి వివరాలు సేకరించి అధిష్టానానికి నివేదించిన తర్వాత .. డీకే శివకుమార్ కు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ సిచువేషన్ నెలకొనడంతో అదే ప్రాసెస్ ను స్టార్ట్ చేశారట. ఇక్కడ కూడా సీనియర్లు మినహాయించి మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షునిగా నియమించాలని కోరారట. అయితే సీనియర్లు మాత్రం రేవంత్ ను ససేమిరా అంటున్నారు. దీంతో పార్టీ హైకమాండ్.. పరిశీలకుడిగా సీనియర్ నేత కమల్ నాథన్ ను నియమించినట్టు తెలుస్తోంది. ఆయన ఒకట్రెండు రోజుల్లో తెలంగాణకు వచ్చి అసలు విషయమేంటో తెలుసుకోనున్నారట. ఆ తర్వాత ఆయన పార్టీ అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఈ లేటెస్ట్ ప్రాసెస్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిదట. ఎందుకంటే దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించాలని నిర్ణయం తీసుకుందట. తెలంగాణ విషయం కూడా త్వరగా తేల్చేస్తే.. శుభం కార్డు వేసేద్దామని కాంగ్రెస్ అధిష్టానం కృత నిశ్చయంతో ఉందట. మొత్తం ఈ ప్రాసెస్ తోనైనా కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారా… లేదంటే శరామామూలే అన్నట్లు మళ్లీ వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.

ALSO READ: అఫ్ఘనిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహం