Jagga Reddy : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోంది : జగ్గారెడ్డి
రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోందని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Congress MLA Jagga Reddy : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోందని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘జగన్మోహన్ రెడ్డి- కేసీఆర్ – షర్మిల’ బీజేపీ నీడలో ఉన్నారని జగ్గన్న చెప్పుకొచ్చారు. అంతర్గతంగా ముగ్గురు చర్చలు జరిపి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నీళ్లు – నిధులు – నియామకాలు అనే పేరుతో కేసీఆర్ ఉద్యమం చేపడితే కాంగ్రెస్ అండగా నిలబడిందన్న జగ్గారెడ్డి.. గతంలో అన్నదమ్ముల వలె భోజనాలు చేశారు – మళ్ళీ భోజనాలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలని జగ్గారెడ్డి ఏపీ – తెలంగాణ కృష్ణాజలాల వివాదంపై వ్యాఖ్యానించారు.
“టీఆరెస్ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ కంటే మూర్ఖుడు అనేది ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ప్రగతి భవన్ కు వచ్చిన్నపుడు గుర్తుకు లేదా?. పీజేఆర్- వైఎస్సార్ మధ్య జల వివాదం కంటే రాజకీయ వివాదమే ఎక్కువ ఉండేది. ముఖ్యమంత్రి కావాలనుకునే నేతలు పీజేఆర్- వైఎస్సార్.” అని జగ్గారెడ్డి గతాన్ని నెమరువేసుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పార్టీలు మారరని చెప్పిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే జల వివాదాలు ఉండవన్నారు.
Read also: Bonalu – Bakrid Festivals: పశు రవాణాపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు