AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు.. నాకేం తక్కువ అంటూ మండిపడుతున్న సీనియర్ లీడర్.. అసలేం జరిగిందంటే..

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు రేగింది. కొత్త కమిటీలపై రచ్చ మొదలైంది. చోటు దక్కని నేతలంతా నిరసన గళం వినిపిస్తున్నారు. రీసెంట్‌గా ఏఐసీసీ ప్రకటించిన కమిటీలపై ఓ సీనియర్‌ లీడర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాకేం తక్కువ! నన్నెందుకు తీసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇంతకీ, ఆ లీడర్‌ ఎవరు?.

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు.. నాకేం తక్కువ అంటూ మండిపడుతున్న సీనియర్ లీడర్.. అసలేం జరిగిందంటే..
Telangana Congress
TV9 Telugu
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 21, 2023 | 6:53 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు రేగింది. కొత్త కమిటీలపై రచ్చ మొదలైంది. చోటు దక్కని నేతలంతా నిరసన గళం వినిపిస్తున్నారు. రీసెంట్‌గా ఏఐసీసీ ప్రకటించిన కమిటీలపై ఓ సీనియర్‌ లీడర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాకేం తక్కువ! నన్నెందుకు తీసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇంతకీ, ఆ లీడర్‌ ఎవరు?.

కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో!, ఏ లీడర్‌ ఎప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతారో అస్సలు ఊహించలేం! అంతా బాగుంది అనుకునేలోపే ఊహించనివిధంగా సునామీ పుడుతుంది! పార్టీ పుంజుకుంటోంది, మంచి జోష్‌ మీదుంది! అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు! కలిసి ముందుకెళ్తున్నారు! అనుకునేలోపే ఏదో ఒక రచ్చ మొదలవుతుంది!. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అలాంటి రగడ మొదలైంది!. కర్నాటకలో గెలుపు, చేరికలతో మాంచి జోష్‌ మీదున్న టీకాంగ్రెస్‌లో మరో అసమ్మతి గళం లేచింది. అది కూడా ఓ సీనియర్‌ లీడర్‌ నుంచి!. గతంలో ఎప్పుడూ అసంతృప్తి గళం విప్పని పొన్నం ప్రభాకర్‌… కాంగ్రెస్‌ పెద్దల తీరుపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

త్వరలోనే జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం స్పెషల్‌ టీమ్‌ను ప్రకటించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ప్రత్యేక ఎన్నిక కమిటీ పేరుతో 26మంది సీనియర్లకు చోటు కల్పించింది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఇందులో, రేవంత్‌తోపాటు భట్టి, జీవన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జానారెడ్డి, వీహెచ్‌, పొన్నాల, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, రేణుకాచౌదరి, బలరాం నాయక్‌, షబ్బీర్‌ అలీ, పోడెం వీరయ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సునీతారావు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్‌ను ఎక్స్ఆఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు. అయితే, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తనను ఎందుకు విస్మరించారంటూ నిరసన గళం విప్పారు పొన్నం. ఇంతకుముందు ప్రకటించిన ప్రచార కమిటీలో కూడా తన పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు టాక్‌. కాంగ్రెస్‌నే నమ్ముకొని, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న తనను పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కమిటీలపై ఎప్పట్నుంచో రచ్చ జరుగుతోంది టీకాంగ్రెస్‌లో. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ అపాయింట్‌ అయిన తర్వాత ప్రకటించిన కొత్త కమిటీలపై పెద్ద రచ్చే జరిగింది. పదవులన్నీ టీడీపీ నుంచి వలసొచ్చిన వాళ్లకే కట్టబెట్టారంటూ సీనియర్ల నుంచి ఎదురుదాడి జరిగింది. రీసెంట్‌గా మండల కమిటీలపైనా రచ్చరచ్చఅయ్యింది. ఇప్పుడు ఏఐసీసీ ప్రకటిస్తున్న కమిటీలపైనా పొన్నంలాంటి సీనియర్ల నుంచి నిరసనగళం వస్తోంది. మరి, ఇది టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోతుందా? లేక సునామీలా మారుతుందా? చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..