Bhatti Vikramarka: పెట్రోల్ ధరలకు నిరసనగా ఖమ్మంలో భట్టి విక్రమార్క శపథం.!

అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని సీఎల్పీ లీడర్/..

Bhatti Vikramarka: పెట్రోల్ ధరలకు నిరసనగా ఖమ్మంలో భట్టి విక్రమార్క శపథం.!
ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతటా ఎద్దుల బండ్లు, సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించింది. ఇందులో చేపట్టిన నిరసన ప్రదర్శనలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 12, 2021 | 3:11 PM

Khammam Cycle Rally: అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన ఖమ్మంలో సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత దారుణంగా ఎప్పుడూ పెట్రో ధరలు పెంచ లేదన్నారు భట్టి. సామాన్య ప్రజల నడ్డివిరిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు నా పోరాటం ఆగదని మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా శపథం చేశారు.

Read also: Vellampalli: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం: మంత్రి వెల్లంపల్లి