AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పార్లమెంట్‌కు రెండు సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే.. లేదంటే మా ప్రతాపం చూపిస్తామంటున్న నేతలు..

Telangana Congress: బీసీలకు టికెట్లపై కాంగ్రెస్ లో డిమాండ్ పెరిగింది. జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ కు అల్టిమేటం ఇస్తున్నారు. టిక్కెట్ల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎదురు దాడి తప్పదని హెచ్చరిస్తున్నారు బీసీ నేతలు. ఇలా బీసీ నేతల అల్టిమేటంతో తలలు పట్టుకుంటోంది ఎన్నికల స్ర్కీనింగ్ కమిటీ. ఇంతకీ టీ కాంగ్రెస్‌లో టిక్కెట్ అడుగుతున్న ఆ బీసీ నేతలెవరు.. ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Telangana: పార్లమెంట్‌కు రెండు సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే.. లేదంటే మా ప్రతాపం చూపిస్తామంటున్న నేతలు..
Telangana Congress
TV9 Telugu
| Edited By: |

Updated on: Sep 29, 2023 | 1:51 PM

Share

Telangana Congress: బీసీలకు టికెట్లపై కాంగ్రెస్ లో డిమాండ్ పెరిగింది. జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ కు అల్టిమేటం ఇస్తున్నారు. టిక్కెట్ల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎదురు దాడి తప్పదని హెచ్చరిస్తున్నారు బీసీ నేతలు. ఇలా బీసీ నేతల అల్టిమేటంతో తలలు పట్టుకుంటోంది ఎన్నికల స్ర్కీనింగ్ కమిటీ. ఇంతకీ టీ కాంగ్రెస్‌లో టిక్కెట్ అడుగుతున్న ఆ బీసీ నేతలెవరు.. ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

టీ కాంగ్రెస్ లో బీసీ నినాదం మారుమోగుతుంది. ఈ సారి ఎన్నికల్లో బీసీ లకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చాలా రోజుల నుంచే బీసీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. బీసీల కోసం సీట్లు త్యాగం చేయాలనే డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు బీసీ లీడర్స్. ప్రతి లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో బీసీ లకు రెండు సీట్లు ఇస్తామని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటన కూడా చేసారు. దీంతో బీసీ నేతలు మరింత గట్టిగా టిక్కెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అయితే అన్ని లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బీసీలకు రెండు సీట్లు సాధ్యమేనా అనే చర్చ కూడా జరుగుతుంది. అలా సాధ్యం కాని పక్షంలో రాష్ట్రం యూనిట్‌గా చేసి 17 లోక్ సభ స్థానాలకు 34టిక్కెట్ లు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తుందట. కానీ 2014 లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓక్క బీసీ నేత ఎమ్మెల్యే గా గెలవలేదు. 2018లో ఓకే ఓక బీసీ నేత ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ గెలిచిన వ్యక్తి కూడా తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. దాంతో కాంగ్రెస్‌లో ఎక్కువ మంది బీసీ లకు టిక్కెట్ లు ఇస్తే గెలిచివస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది.

ఇక లోక్ సభ పార్లమెంట్ పరిధిలో టికెట్ ఆశిస్తున్న బీసీ లీడర్స్‌లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లను ఓసారి పరిశీలిద్దాం..

1. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో.. 1. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్, 2 వేములవాడ – ఆది శ్రీనివాస్, 3. కరీంనగర్ -కొనగల మహేష్ ఉన్నారు. ఈ మూడు సెగ్మెంట్ లలో హుస్నాబాద్, కరీంనగర్ లలో ఓసి లీడర్స్ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

2.పెద్దపల్లి లోక్ సభ పరిధిలో.. 1. రామగుండం – రాజ్ ఠాకూర్, 2. పెద్దపల్లి – గంటా రాములు యాదవ్, ఈర్ల కొమురయ్యలు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

3. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. ఆదిలాబాద్ -గండ్ర సుజాత, 2 సిర్పూర్ – రావి శ్రీనివాసస్ 3. ముధోల్ – ఆనంద్ రావు పటేల్ లు ఉన్నారు.

4. నిజామాబాద్‌ పార్లమెంట్ పరిధిలో.. 1. ఆర్మూర్ -గోర్తా రాజేందర్, 2. నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్, ఈరత్రి అనిల్ పోటీ పడుతున్నారు.

5.మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో .. 1.దుబ్బాక -కత్తి కార్తీక గౌడ్,2. పటాన్ చెరువు – కాట శ్రీనివాస్ గౌడ్,3. సిద్దిపేట – శ్రీనివాస్ గౌడ్ లు బీసీ కోటాలో టిక్కెట్ అడుగుతున్నారు.

6. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. బాన్సువాడ – బాలరాజు, 2. నారాయణఖేడ్ – సురేష్ షట్కర్ పోటీ లో ఉన్నారు..

7.మల్కాజ్గిరి సెగ్మెంట్ లో.. 1. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్,2. మల్కాజ్ గిరి – నందికంటి శ్రీధర్,3. ఎల్బీనగర్ -మధు యాష్కీ

8. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, 2. అంబర్ పేట్ నూతి శ్రీకాంత్ గౌడ్, మొతా రోహిత్

9. చేవెళ్ల లోక్ సభ పరిధిలో.. 1. రాజేంద్రనగర్ – గౌరీ సతీష్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 2. శేరిలింగంపల్లి – జర్పెటి జైపాల్ లు బీసీ కోటాలో తమకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

10. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో.. 1. నారాయణపేట -ఎర్ర శేఖర్, 2. షాద్ నగర్ – ఈర్లపల్లి శంకర్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, 3.దేవరకద్ర – ప్రదీప్ గౌడ్, 4.మక్తల్ – శ్రీహరి, నాగరాజు గౌడ్ లు ఉన్నారు.

11. నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లో.. 1. గద్వాల్ – రాజీవ్ రెడ్డి, సరితా తిరుపతయ్య

12. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో.. 1. నల్లగొండ – చెరుకు సుధాకర్

13. భువనగిరి పార్లమెంట్ పరిధిలో.. 1. మునుగోడు – పున్నా కైలాష్ నేత, 2. ఆలేరు -బీర్ల ఐలయ్య, 3. జనగామ -పొన్నాల లక్ష్మయ్యలు అయా సెగ్మెంట్ పరిధిలో తమకు టిక్కెట్ ఇవ్వాల్సిందే అంటుంన్నారు.

14. వరంగల్ పార్లమెంట్ పరిధిలో.. 1. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ, 2. పరకాల – అవేలి దామోదర్,

15. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. నర్సంపేట – మేకల వీరన్న యాదవ్ టిక్కెట్ రేసులో ఉన్నారు.

16. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో.. 3 జనరల్ స్థానాలు ఉన్నప్పటికీ బీసీ నేతలు లేకపోవడంతో ఓసి లకు టిక్కెట్ కేటాయింపు చేసే అవకాశం లేదు.

17. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. మలక్ పేట్ – చక్లోకర్ శ్రీనివాస్, 2. గోషామహల్ – మెట్టు సాయికుమార్.

మొత్తంగా 38 మంది బీసీ ముఖ్య నేతలు టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే పార్లమెంట్‌కు రెండు చొప్పున టిక్కెట్‌లు కేటాయిస్తే ఇందులో నలుగురు మినహా మిగతావారందరికీ టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. అయితే గెలుపు ప్రతిపాదికన టిక్కెట్ల కేటాయింపు జరిగితే మాత్రం చాలా మంది నేతలకు మొండి చేయి తప్పదంటున్నారు అదిష్టానం పెద్దలు. చూడాలి మరి బీసీ నేతల అల్టిమేటం ఏమేరకు పనిచేస్తుందో తెలియాలంటే టిక్కెట్ ప్రకటన వరకు ఆగాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఎస్బీఐ ఖతాదారులకు బిగ్ అలెర్ట్.. ఈ టైమ్‌లో యూపీఐ సహా అన్నీ బంద్..
ఎస్బీఐ ఖతాదారులకు బిగ్ అలెర్ట్.. ఈ టైమ్‌లో యూపీఐ సహా అన్నీ బంద్..
ఈ చిట్కాతో మోకాళ్ళ నొప్పులు పోయి.. వృద్ధాప్యంలో కూడా గుర్రంలా..
ఈ చిట్కాతో మోకాళ్ళ నొప్పులు పోయి.. వృద్ధాప్యంలో కూడా గుర్రంలా..
టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ఇతడే.. అడ్డుకోకుంటే సిరీస్ మీకు దక్కదు
టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ఇతడే.. అడ్డుకోకుంటే సిరీస్ మీకు దక్కదు
డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
టమాటో పచ్చి మిర్చి పచ్చడి ఇలా చేస్తే.. వదలకుండా తింటారు!
టమాటో పచ్చి మిర్చి పచ్చడి ఇలా చేస్తే.. వదలకుండా తింటారు!
అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!
అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!
ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు..
ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు..
ఆన్‌లైన్ కంటే కౌంటర్ వెయిటింగ్ టికెట్లు త్వరగా కన్ఫార్మ్ అవుతాయా
ఆన్‌లైన్ కంటే కౌంటర్ వెయిటింగ్ టికెట్లు త్వరగా కన్ఫార్మ్ అవుతాయా
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అదుర్స్.. 3 మెయిడిన్లతో 3 వికెట్లు!
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అదుర్స్.. 3 మెయిడిన్లతో 3 వికెట్లు!
ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో..
ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో..