AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: గంగా రామాయణ యాత్ర.. 6 రోజుల్లో కాశీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల దర్శనం!

IRCTC Ganga Ramayan Yatra Telugu: హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా 6 రోజుల్లో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. 2026 డిసెంబర్ 16న ప్రారంభమయ్యే ఈ విమాన ప్రయాణ ప్యాకేజీ ధరలు, ప్రయాణ షెడ్యూల్, వసతి, భోజన సదుపాయాల వివరాలు తెలుసుకోండి.

IRCTC: గంగా రామాయణ యాత్ర.. 6 రోజుల్లో కాశీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల దర్శనం!
Irctc Ganga Ramayan Yatra
Rajashekher G
|

Updated on: Oct 23, 2026 | 3:33 PM

Share

IRCTC Ganga Ramayan Yatra Telugu: ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గంగా రామాయణ యాత్ర ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ప్రారంభమయ్యే ఈ యాత్రలో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. మొత్తం 6 రోజులు, 5 రాత్రుల పాటు సాగే ఈ పర్యటనలో దేవాలయాల దర్శనంతో పాటు చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది.

గంగా రామాయణ యాత్ర పూర్తి వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SHA10. 2026 డిసెంబర్ 16న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఇండిగో విమానం 6E 915 ద్వారా ఉదయం 10.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు వారణాసి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 21న రాత్రి 8.20 గంటలకు లక్నో నుంచి బయలుదేరి రాత్రి 10.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

  1. మొదటి రోజు: వారణాసి దర్శనం: మొదటి రోజు వారణాసి చేరుకున్న తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. భోజనం అనంతరం ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం, గంగా ఘాట్‌లను సందర్శిస్తారు. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది. అయితే, ఆలయాలు, ఘాట్‌ల వద్దకు పెద్ద బస్సులు వెళ్లడానికి అనుమతి ఉండదు. భక్తులు ఆటోరిక్షాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే ఖర్చులను పర్యాటకులే భరించాలి.
  2. రెండో రోజు: సారనాథ్, బిర్లా ఆలయం: రెండో రోజు అల్పాహారం అనంతరం బౌద్ధులకు పవిత్రమైన సారనాథ్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం వారణాసికి తిరిగి వచ్చి బిర్లా ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం గంగా ఘాట్‌ల వద్ద గడపడానికి, స్థానికంగా షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మూడో రోజు: ప్రయాగ్‌రాజ్, అయోధ్య: మూడో రోజు వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరుతారు. అక్కడ అలోపీ దేవి ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అనంతరం అయోధ్యకు చేరుకుని హోటల్‌లో బస చేస్తారు.
  5. నాలుగో రోజు: అయోధ్య నుంచి లక్నో: నాలుగో రోజు అయోధ్యలోని ప్రసిద్ధ రామమందిరాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం హోటల్ నుంచి బయలుదేరి లక్నో చేరుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
  6. ఐదో రోజు: నైమిశారణ్యం: ఐదో రోజు లక్నో నుంచి నైమిశారణ్యానికి వెళ్లి అక్కడి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి లక్నోకు చేరుకుంటారు.
  7. ఆరో రోజు: లక్నో సందర్శన, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం: చివరి రోజు అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి లక్నోలోని చారిత్రక బారా ఇమాంబారాను సందర్శిస్తారు. మధ్యాహ్నం 4 గంటలలోపు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరలు ఎంతంటే?

ఈ యాత్రకు కంఫర్ట్ క్లాస్‌లో ఒక్కొక్కరికి అయ్యే ఖర్చులు ఇలా ఉన్నాయి.

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.46,050
  • డబుల్ ఆక్యుపెన్సీ: రూ.36,100
  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.34,300
  • 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో: రూ.30,600
  • 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా: రూ.27,750
  • 2–4 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా: రూ.17,000

ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు, హోటల్ వసతి, ఐదు అల్పాహారాలు, ఐదు రాత్రి భోజనాలు, ఒక మధ్యాహ్న భోజనం, ఏసీ బస్సులో స్థానిక సందర్శనలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు, వర్తించే పన్నులు ఉంటాయి. విమానంలో భోజనం, అదనపు ఆహారం, వ్యక్తిగత ఖర్చులు, పూజలు, టూర్ గైడ్ సేవలు, స్థానిక రవాణా వంటి ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.

ఈ యాత్రలో మొత్తం 29 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్యాకేజీ వివరాలు పేర్కొంటున్నాయి. విమాన సమయాలు, హోటళ్లు, యాత్ర షెడ్యూల్‌లో విమానయాన సంస్థల నిర్వహణ పరిస్థితులు లేదా స్థానిక కారణాల వల్ల మార్పులు ఉండవచ్చు. బుకింగ్ చేసే ముందు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో తాజా ధరలు, సీట్ల లభ్యత, నిబంధనలను పరిశీలించడం మంచిది.

ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us