చివరగా.. దీపావళి సందర్భంగా ఒకే దీపాన్ని మళ్లీ ఉపయోగించాలా? లేక కొత్త దీపాన్ని వెలిగించాలా? అనే సందేహానికి సమాధానం ప్రధానంగా దీపం తయారైన పదార్థం, దాని పరిస్థితి, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. ఇత్తడి, రాగి, స్టీల్ దీపాలను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించడం సాధారణంగా ఆచరణలో ఉంది. మట్టి ప్రమిదలను కూడా వాటి పరిస్థితిని బట్టి తిరిగి ఉపయోగించవచ్చు. అయితే, దీపావళి వంటి ప్రత్యేక పర్వదినాల్లో కొత్త మట్టి ప్రమిదలను ఉపయోగించడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీపారాధనలో భక్తి, శుభ్రత, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. దీపాన్ని కొత్తదిగా ఉపయోగించాలా, పాతదాన్నే శుభ్రం చేసి ఉపయోగించాలా అనేది మీ కుటుంబ ఆచారాలు, వ్యక్తిగత విశ్వాసాలకు అనుగుణంగా నిర్ణయించుకోవచ్చు. (Disclaimer: ఈ కథనం హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. దీపారాధనకు సంబంధించిన పద్ధతులు ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సంప్రదాయాలను బట్టి మారవచ్చు. వీటిని మతపరమైన, ఆధ్యాత్మిక విశ్వాసాల కోణంలో మాత్రమే పరిగణించగలరు.)