AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: రెండో రోజు ఫుడ్‌బాల్ ప్రాక్టీస్.. మెస్సీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్

ప్రపంచ ఫుడ్‌బాల్‌ స్టార్ ప్లేయర్ లియోనెల్‌ మెస్సీతో మ్యాచ్‌ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నద్దం అవుతున్నారు. ఇందులో భాగంగానే రెండో రోజులు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ గ్రౌండ్స్‌లో ఇతర ప్లేయర్లతో కలసి ఆయన ఫుడ్‌బాల్‌ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

CM Revanth Reddy: రెండో రోజు ఫుడ్‌బాల్ ప్రాక్టీస్.. మెస్సీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్
Cm Revanth Reddy
Anand T
|

Updated on: Dec 02, 2025 | 1:14 PM

Share

ప్రపంచ ఫుడ్‌బాల్‌ స్టార్ ప్లేయర్ లియోనెల్‌ మెస్సీతో మ్యాచ్‌ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నద్దం అవుతున్నారు. ఇందులో భాగంగానే రెండో రోజులు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ గ్రౌండ్స్‌లో ఇతర ప్లేయర్లతో కలసి ఆయన ఫుడ్‌బాల్‌ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇండియా టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌ రానున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ప్రత్యేక సమావేశం కానున్నారు. అనంతరం మెస్సీ టీమ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఉప్పల్ స్టేడియంలో ప్రెండ్లీ ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెండ్రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉదయమంతా అధికార కార్యక్రమాల్లో బిజిగా గడుపుతూ.. రాత్రి వేళల్లో ఇతర ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించేందుకు, ఆయనతో సమావేశం అయ్యేందుకు ఎదురు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ సొంత గడ్డపై మీలాంటి లెజెండ్‌ను చూడాలని కలలు కన్న ప్రతి ఫుట్‌బాల్ అభిమానికి ఒక ఉత్తేజకరమైన క్షణం అన్నారు. అయితే తాజాగా మెస్సీతో మ్యాచ్ అడేందుకు ఫుడ్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ కింద ఆయన ఇలా రాసుకొచ్చారు.. ‘క్రీడా స్ఫూర్తి.. తెలంగాణ కీర్తి అని సీఎం అన్నారు. ఈ నెల 13న ప్రపంచ ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీతో ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించినట్టు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.