RBI Jobs 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 11వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

చెన్నైలొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 11వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 11, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి విజిట్ పర్ అవర్‌కు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి..
అడ్రస్..
Director, Human Resource Management Department (Recruitment Section), Reserve Bank of India, Fort Glacis, 16, Rajaji Salai, Chennai – 600 001
(రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్ట్ గ్లాసిస్, 16, రాజాజి సలాయ్, చెన్నై-600001)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
