RRB NTPC UG 2025: 3 రోజుల్లో డెడ్‌లైన్.. రైల్వేలో ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి..
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందింది. NTPC UG నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేయగా.. ఇప్పుడు వాటికి దరఖాస్తు చేసుకోవడానికి గుడుపు పొడిగించారు. దరఖాస్తు చేసుకోవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం గడువు పొడిగించారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాం.

Railway Jobs: రైల్వేల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవల ఆర్‌ఆర్‌బీ NTPC UG రిక్రూట్‌మెంట్- 2025 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు లక్షలాది మంది దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకుంటుండగా.. ఇంకా అప్లై చేసుకోనివారికి శుభవార్త అందింది. దరఖాస్తుల గుడువును డిసెంబర్ 4 వరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పొడిగించింది. ఇక ఫీజు చెల్లింపునుకు డిసెంబర్ 6 వరకు టైమ్ ఇవ్వగా.. 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అప్లికేషన్ డీటైల్స్‌లో మార్పులకు అవకాశం కల్పించనుంది. ఇక డిసెంబర్ 17 తేదీ నుంచి 21 వరకు అభ్యర్థులు అవసరమైన పత్రాలను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఫీజు చెల్లించడానికి నవంబర్ 29 చివరి తేదీగా ఉండగా.. ఇప్పుడు గడువు పెరిగింది
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
-ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
-హోమ్ పేజీలో RRB NTPC UG రిక్రూట్‌మెంట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
-మీ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వండి
-ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించండి
-సబ్మిట్‌పై క్లిక్ చేసి కన్పర్మేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి
పోస్టుల వివరాలు
మొత్తం 3058 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2424 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 394 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ , 163 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 77 ట్రైన్స్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నియామక ప్రక్రియ
తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. దాంతో పాటు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీటిల్లో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు ఉంటాయి.




