Telangana: నేడు టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ విస్తృత స్థాయి సమావేశం.. చర్చకు రానున్న పలు కీలక అంశాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల

Telangana: నేడు టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ విస్తృత స్థాయి సమావేశం.. చర్చకు రానున్న పలు కీలక అంశాలు..
Follow us

|

Updated on: Dec 17, 2021 | 9:42 AM

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరకానున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా కేసీఆర్‌ పార్టీనేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బీజేపీపై ఎదురుదాడి పెంచి దుకూడుగా పనిచేయాలని సూచిస్తారని భావిస్తున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఈ సమావేశంలో ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే రాజకీయంగా పార్టీ శ్రేణులంతా అన్ని స్థాయిలో క్రియాశీలకం కావాలని తప్పక ఆదేశిస్తారని భావిస్తున్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనలో అక్కడి సీఎం స్టాలిన్‌తో జగిన సమావేశంలో చర్చించి రాజకీయ అంశాలు పార్టీ నేతలతో పంచుకుంటారనే అంచనాలో గులాబీ నేతలున్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం వ్యవహారాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లడం, పంట మార్పిడిపై అన్నదాతలకు అర్థమయ్యే విధంగా సర్ది చెప్పాలని సూచిస్తారనే భావనలో ఉన్నారు పార్టీ నేతలు .

ఖరారైన జిల్లా పర్యటనలు..

ఇక కీలకమైన దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో వంద శాతం అమలు చేస్తామన్న నిర్ణయాన్ని దళిత వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు కేసీఆర్ చెప్పనున్నట్లు సమాచారం. మొత్తంగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడానికి సంబంధించి పలు కీలకాంశాలను ఈ సమావేశంలో కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు. పార్టీ సీనియర్ల నుంచి కూడా పలు కీలక సమాచారం, సలహాలు, సూచనలు గులాబీ బాస్‌ తీసుకోనున్నారు. కాగా అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో కేసీఆర్‌ సమావేశం కానుండడం కాస్త ఉత్కంఠతను కలిగిస్తోంది. మరో వైపు సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు కూడా ఖరారయ్యయి. ఎల్లుండి నుంచి జిల్లాల బాట పట్టనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా ఆఫీస్‌లను ప్రారంభించడంతో పాటు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నెల 19న వనపర్తి జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. 20న జనగాం జిల్లాలో సీఎం పర్యటిస్తారు. నూతన కలెక్టరేట్‌తో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Also Read:

Warangal: బంధువులను బినామీలుగా పెట్టి భూమి డబుల్‌ రిజిస్ట్రేషన్‌.. ఇద్దరు సీఐలపై కేసులు నమోదు..

Robbery Gang: అక్షయ్ కుమార్ సినిమా చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యారు.. కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేసి బుక్కయ్యారు..

Hyderabad: కిడ్నీలో 156 రాళ్లు.. 350 గ్రాములకు పైనే బరువు.. విజయవంతంగా తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు..