AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Strike: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె…

Bank Strike: బ్యాంకులను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ బ్యాంకులను..

Bank Strike: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె...
Bank Strike
Surya Kala
|

Updated on: Dec 17, 2021 | 9:51 AM

Share

Bank Strike: బ్యాంకులను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చేస్తుందంటూ బ్యాంక్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం, గ్రామీణ బ్యాంకులు మూతబడ్డాయి.

రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ:  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ, రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంతో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నామని ప్రకటించారు. అంతకుముందు 2019లో.. IDBI బ్యాంక్‌లో మెజారిటీ వాటాను LICకి విక్రయించడం ద్వారా IDBI బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది.

నాలుగేళ్లలో పలు ప్రభుత్వం రంగ బ్యాంకులను కేంద్రం విలీనం చేసింది. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ  ప్రభుత్వం నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది.

అయితే బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయవద్దని పలు బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి దృష్ట్యా, ఉద్యోగుల సమ్మె కారణంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని బ్యాంకు పేర్కొంది. SBI కూడా చర్చల కోసం బ్యాంకు యూనియన్లకు ఆహ్వానం పంపింది..  అయితే బ్యాంకు ఉద్యోగులు ప్రయివేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ సమ్మెకు దిగారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులు, యూనియన్‌లకు తమ సభ్యులను బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ లేఖ రాసింది. సమ్మె చేయవద్దని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) చేసిన విజ్ఞప్తి కూడా ఫలించలేదు. దీంతో రెండు రోజు కూడా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. పలు బ్యాంక్ ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోయాయి.

Also Read:  పాకిస్తాన్ ఎప్పుడో దివాళా.. ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలే అంటూ ఎఫ్‌బిఆర్ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

Follow Us
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
అదనపు ఆదాయం మీ చేతుల్లో: 3 'సైడ్ ఇన్‌కమ్' రహస్యాలు ఇవే
అదనపు ఆదాయం మీ చేతుల్లో: 3 'సైడ్ ఇన్‌కమ్' రహస్యాలు ఇవే