AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా.. ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలే అంటూ ఎఫ్‌బిఆర్ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన ప్రకటన చేశారు.  ఓ కార్యక్రమంలో షబ్బర్ జైదీ మాట్లాడుతూ..

Pakistan: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా.. ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలే అంటూ ఎఫ్‌బిఆర్ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..
Pakistan
Surya Kala
|

Updated on: Dec 17, 2021 | 8:59 AM

Share

Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన ప్రకటన చేశారు.  ఓ కార్యక్రమంలో షబ్బర్ జైదీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక సంస్థగా దివాళా తీసింది…అయితే దేశంలో అంతా బాగుందని చెబుతున్నారు.. మార్పు తీసుకువస్తామని అంటున్నారు.. అయితే ఇందులో నిజం లేదు.. కానీ దివాళా తీసినా.. దైర్యం చెప్పడంలో తప్పులేదని అన్నారు. ప్రస్తుతం దేశం దివాళా తీసిందని తాను భావిస్తున్నాట్లు చెప్పారు.. అయితే దేశంలో అంతా బాగానే ఉందని, పనులు సవ్యంగా సాగుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెబుతున్న మాటలు అన్నీ విషయాలన్నీ అబద్ధాలని అన్నారు.

హమ్దార్ద్ యూనివర్శిటీలో ప్రసంగిస్తున్న సమయంలో పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ ఛైర్మన్ షబ్బర్ జైదీ ఈ విషయాలు తెలిపారు. షబ్బర్ జైదీ మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి కోసం ఇది చేస్తాం.. అది చేస్తామని చెప్పడం.. రాజకీయ నాయకులు తమ వాక్చాతుర్యంతో ప్రజలను మోసం చేయడమేనని చెప్పారు. అయితే, ఇప్పుడు జైదీ తాను చేసిన ఆరోపణలపై ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. తన ప్రసంగానికి సంబంధించిన మూడు నిమిషాల క్లిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారని.. అయితే తాను దేశం అభివృద్ధి చెందాలంటే చెప్పిన పరిష్కారం గురించి  ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు.

పాకిస్థాన్ ఏ దేశం నుంచి ఎవరి ద్వారా అప్పు తీసుకున్నా ప్రభుత్వాన్ని తిట్టడం వలన ఏమీ జరగదని షబ్బర్ జైదీ అన్నారు. అయితే పాకిస్థాన్ తీసుకున్న రుణం,వడ్డీ రేట్ల నిర్ణయం తార్కిక పద్ధతిలో జరగాలని సూచించారు. ప్రపంచంలో ఏ దేశమైనా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలంటే.. ఎగుమతుల విషయంలో తమ బలాన్ని చాటుకోవాలని చెప్పారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా దివాళా నుంచి ఆర్ధికంగా బలపడాలంటే.. ఎగుమతులను పెంచుకునే దిశగా అడుగులు వేయాలి.  ప్రస్తుతం పాకిస్థాన్ దేశం నుంచి ఎగుమతులు విలువ 20 బిలియన్ డాలర్లు ఉందని జైదీ చెప్పారు. అయితే ఈ ఎగుమతులు పెరగాలంటే అమెరికాతో స్నేహం చేయాలని సూచించారు.

జైదీ ప్రకటనను ఖండించిన ప్రభుత్వం: 

అయితే షబ్బర్ జైదీ ప్రకటనను పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ప్రతినిధి ముజమ్మిల్ అస్లాం ఖండించారు. దేశం రెండుసార్లు దివాళా తీసిందని చెప్పిన జైదీ వాదనను ఆయన ఖండించారు. ఇప్పటికే పాకిస్థాన్  1998-99లో ,  2009లో దివాళా తీసింది. ఇక పాక్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ దేశ పరిస్థితి మరీ దారుణంగా మారడం గమనార్హం. దేశాన్ని నడపడానికి ఇమ్రాన్ ప్రభుత్వం విదేశాల నుంచి అప్పులు తీసుకోవలసి వచ్చింది. దీంతో పాకిస్థాన్‌పై విదేశీ అప్పుల ఒత్తిడి కూడా పెరుగుతోంది.

Also Read:  దివ్యాంగ మహిళ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ.. ఫోటో వైరల్..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..