KCR On Budget: ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్.. ఆ పనితో మోదీకి నిద్రపట్టడం లేదంటూ..
KCR On Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. బడ్జెట్‌లో కేటాయింపుల్లో అన్ని రంగాలకు అన్యాయం చేశారన్న కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లో...
KCR On Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. బడ్జెట్‌లో కేటాయింపుల్లో అన్ని రంగాలకు అన్యాయం చేశారన్న కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నాడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనున్న సమయంలో మోదీ అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.
ఈ విషయమై కేసీఆర్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో పరిశ్రమలు పెరిగాయి. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. సాఫ్ట్ వేర్, ఐటీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుదారుల మధ్య గొడవలు జరుగుతాయి. కోర్టుల్లో పరిష్కారం కావాలంటే సమయం పడుతుంది. కోర్టు బయట పంచాయతీలు తెంపుకునే వ్యవస్థను యావత్ ప్రపంచం అవలంభిస్తోంది. దీన్ని పుట్టుకు వచ్చిందే లోకాయుక్త. ఆర్బిట్రేషన్ సెంటర్లు కూడా మన దేశంలో లేవు. సింగపూర్, దుబాయ్, లండన్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. ఇండియా పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ అంశం తన దృష్టికి వచ్చిన తర్వాత సీజేఐ ఎన్వీ రమణను ప్రార్థించాను. వారు దయతలచి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
కొంత ఖర్చు అయినా భయపడకుండా ముందుకు వచ్చి ఈ సెంటర్‌కు ఓ భవనాన్ని కిరాయికి తీసుకొని, రూ. 15 కోట్లతో సదుపాయాలు కల్పించాం. ప్రతి సంవత్సరం రూ. 3 కోట్లు ఇస్తామని చెప్పాం. రూ. 300 కోట్ల విలువైన జాగను ఇచ్చాం. రూ. 50 కోట్లతో సొంత భవనం నిర్మించబోతున్నాం. ఈ నెల 5న శంకుస్థాపన చేస్తారు. దీంతో మోదీకి నిద్ర పట్టడం లేదు. దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. నిర్మలా సీతారామన్ కూడా ఆత్మ ద్రోహం చేసుకున్నారు. హైదరాబాద్ యువకులు, మేధావులు బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఆలోచించాలి’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. మరి సీఎం ప్రెస్‌మీట్ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: Budget 2022: దేశానికి వెన్నెముక రైతన్న ఈ బడ్జెట్ నుంచి ఏమి కోరుకున్నాడు? నిర్మలమ్మ ఏమిచ్చారు?
Bangarraju: నాగ్, చైతూల మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుందా..? 18 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా.. మళ్లీ ఆరు వేలకు పైగా కేసులు.. మరిన్ని ఆంక్షల దిశగా సర్కార్!