AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju: నాగ్, చైతూల మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుందా..? 18 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

సంక్రాంతి పండక్కి థియేటర్లలోకి వచ్చిన బంగార్రాజు మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలివారం విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా రెండు, మూడో వారాల్లో కాస్త నెమ్మదించింది. టోటల్‌గా 18 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Bangarraju: నాగ్, చైతూల మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుందా..? 18 రోజుల  కలెక్షన్స్ రిపోర్ట్
Bangarraju
Ram Naramaneni
|

Updated on: Feb 01, 2022 | 3:53 PM

Share

Bangarraju 18 Days Collection: కరోనా(Coronavirus) వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో.. సంక్రాంతి రేస్ నుంచి బడా సినిమాలు సైడ్ అయ్యాయి.  అయినా అక్కినేని హీరోలు నాగ్, చైతూ(Naga Chaitanya) వెనక్కి తగ్గలేదు. తండ్రికొడుకులు కలిసి నటించిన  ‘బంగార్రాజు’ సినిమాను ఫెస్టివల్ స్పెషల్‌గా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‌‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అన్న రిపోర్ట్స్ వచ్చాయి. అయితే పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేకపోయినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కోసం అక్కినేని హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వైరస్ భయంతో జనం పండగ సమయంలోనూ థియేటర్లకు దూరంగా ఉన్నారు. ఈ అంశం కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఈ మూవీ విడుదలై సోమవారంతో 18 రోజులు కంప్లీట్ చేసుకుంది. వసూళ్లపై ఓ లుక్ వేద్దాం పదండి.

రెండు తెలుగు స్టేట్స్‌లో 17వ రోజు(సండే) 33 లక్షల రూపాయలు వసూలు చేసిన బంగార్రాజు చిత్రం.. 18వ రోజు 15 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. ఓవరాల్‌గా చూస్తే ఈ 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 34.62 కోట్ల షేర్, 56.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా చూస్తే 37.87 కోట్ల షేర్, 63.65 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ నిపుణుల రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాగా విడుదలకు ముందు 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘బంగార్రాజు’ చిత్రం.. 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ప్రజంట్ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే.. మరో 1.13 కోట్ల షేర్ వసూలు చేస్తేనే ఈ సినిమా పూర్తిగా హిట్ ఖాతాలో చేరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

సోగ్గాడే చిన్ని నాయనా మూవీని తెరకెక్కించిన  కళ్యాణ్ కృష్ణ కురసాల బంగార్రాజు సినిమాను తీశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలక పాత్రల్లో మెప్పించారు. అనూప్ సంగీతానికి మంచి మార్కులు పడ్డాయి.

Also Read: ఎంతో అందంగా శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్.. కానీ అంతలోనే.. వీడియో వైరల్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్