Sai Chand: గుర్రంగూడకు సాయిచంద్ భౌతికకాయం.. సీఎం కేసీఆర్ సంతాపం..
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ సమాజం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇదిలాఉంటే..
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ సమాజం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇదిలాఉంటే.. కేర్ ఆస్పత్రిలో సాయిచంద్ మృతదేహాన్ని చూసి మంత్రి హరీష్ కన్నీరు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. సాయిచంద్ కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు.
సాయిచంద్ భౌతికకాయాన్ని హైదరాబాద్ గుర్రంగూడలో ఆయన నివాసానికి తరలించారు. భర్త భౌతికకాయాన్ని చూడగానే భార్య బోరున విలపించింది. ఆమె తల్లడల్లుతున్న తీరు చూసి అక్కడ ఉన్నవారి గుండె తరుక్కుపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అక్కడ ఉన్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.
24 గంటల ముందు వరకు.. ఆ కుటుంబం సంతోషానికి కేరాఫ్‌గా నిలిచింది. మేమిద్దరం.. మాకిద్దరు అన్నట్లు ఆ ఫ్యామిలీ సంతోషాల కలబోతగా మారింది. భర్త తెలంగాణ సమాజం అంతా గుర్తుపట్టగలిగే కళాకారుడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాజకీయ నేత. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష. ఇదంతా రెండు మాటల్లో సాయిచంద్ ఫ్యామిలీ గురించి నిన్నటి వరకు ఉన్న చిత్రం. కానీ, 24 గంటలు గడిచే సరికి పరిస్థితి మారిపోయింది. భర్త భౌతికకాయం శవపేటికలో ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన సాయిచంద్ భార్య తట్టుకోలేకపోయింది. సాయి ఎంత పని చేశావంటూ బోరుమన్నది. సాయిచంద్ మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సైతం కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన పాడిన పాటలను తల్చుకుని విలపిస్తున్నారు.
సాయిచంద్ మృతితో వనపర్తి జిల్లా అమరిచింత మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 1984 సెప్టెంబర్ 20న అమరచింతలో సాయిచందు జన్మించారు. విద్యాభ్యాసం అంతా అమరచింత, ఆత్మకూరులో సాగింది. విద్యార్థి దశ నుంచే కళాకారుడిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సాయిచంద్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ఉద్యమస్ఫూర్తి రగిలించారు. సాయిచంద్ మృతిని స్నేహితులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..