AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు కారణాలు ఇవే..

కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం నెలకొంది మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి అల్వాల్ లోని ప్రెసిడెంట్ కాలనీలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతదేహాన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి అక్కడ నుంచి ఉదయం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు రూపాదేవి సత్యం కు ఒక పాప ఒక బాబు ఉన్నారు. విషయం..

Telangana: చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు కారణాలు ఇవే..
Choppadandi Mla
Peddaprolu Jyothi
| Edited By: Subhash Goud|

Updated on: Jun 22, 2024 | 12:21 PM

Share

కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం నెలకొంది మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి అల్వాల్ లోని ప్రెసిడెంట్ కాలనీలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతదేహాన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి అక్కడ నుంచి ఉదయం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు రూపాదేవి సత్యం కు ఒక పాప ఒక బాబు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాకా రూపా దేవి ఆత్మహత్య చేసుకున్న సమయంలో మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మేడిపల్లి సత్యం 12 ఏళ్ల క్రితమే రూపాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా బషీరాబాద్ లోని విల్లాస్ లో నివాసం ఉండేవారు. ఇటీవల కాలంలో అల్వాలలోని పంచ శీల కాలనీలో రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటున్నారు. గతంలో మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా ఆ తర్వాత బదిలీలలో భాగంగా వికారాబాద్ రూపా దేవిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ప్రస్తుతం మేడ్చల్ మండలంలో రావల్ కోల్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్ గా పని చేస్తున్నారు. రూపా దేవి గత మూడు రోజులుగా విధులకు హాజరుకాపడ లేదని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. అందరితో మమేకమై ఉండే రూపా దేవి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమంటున్నారు తోటి ఉపాధ్యాయులు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎంత ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు తమ మధ్య లేకపోవడం దురదృష్టకరమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె మరణం పట్ల విద్యార్థులు సైతం షాక్‌కు గురయ్యారు.

అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు రాగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గత మూడు సంవత్సరాల నుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా రూపా దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్ర కడుపు నొప్పి వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. అయితే గదిలోకి వెళ్లిన ఆమె.. భర్త సత్యంకి కాల్ చేసి తన సమస్యను చెప్పుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా, మొదటగా భార్యాభర్తల మధ్య భేదాలు కారణంగా రూపా దేవి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదని, అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె అంత్యక్రియలు తిరుమలగిరి స్మశాన వాటికలో నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి