Khammam: కేజీ చేపలు రూ.100కే.. పోటెత్తిన జనం.. సీన్ కట్ చేస్తే…

ఆ గ్రామంలోని చెరువు వద్ద కిలో అతి తక్కువ ధరకే విక్రయించడంతో వివిధ మండలాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీ పెరిగి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారి కాపలా మధ్య చేపల విక్రయం జరిగింది.

Khammam: కేజీ చేపలు రూ.100కే.. పోటెత్తిన జనం.. సీన్ కట్ చేస్తే...
Fish
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jun 22, 2024 | 3:01 PM

అత్యంత చౌక ధరకే చేపలు లభిస్తున్నాయి అంటే.. నాన్ వెజ్ లవర్స్ ఊరుకుంటారా చెప్పండి. ఆగమేగాల మీద ఆ స్పాట్‌లో వాటిపోతారు. సరుకు అయిపోకముందే దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఖమ్మం జిల్లాలో అదే జరిగింది. ఓ గ్రామంలోని చెరువు వద్ద తక్కువ రేటుకే చేపలు అమ్మడంతో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి క్యూ కట్టారు. దీంతో తోపులాట జరిగింది. ఏకంగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటకు చెందిన ఒక వ్యక్తి చేపల చెరువు సాగు చేస్తున్నాడు. చేపలు మంచి ఏపుగా పెరగడంతో.. తాజాగా అమ్మకం షురూ చేశాడు. అయితే కిలో కేవలం 100 రూపాయలకే అని చాటింపు వేయించాడు. ఈ విషయం చుట్టుపక్కల అన్ని గ్రామాలకు పాకింది. అసలే ముసురు పట్టింది.. మంచిగా చేపల పులుసు, ఫ్రై తింటే బాగుంటుంది అనుకున్న నాన్ వెజ్ ప్రియులకు చెరువు వద్దకు పోటెత్తారు. జనం అంతకంతకు పెరగడంతో.. యజమాని ముళ్ల కంచె ఏర్పాటు చేశాడు. అయినా జనం తోపులాట ఆగలేదు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఓనర్ పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీస్ ప్రొటక్షన్ మధ్య చేపల విక్రయం జరిగింది. అయితే క్యూలైన్ భారీగా ఉండటంతో.. కొనేందుకు వచ్చిన వారు గంటల తరబడి ఎండలో నిల్చోని ఇబ్బందులు పడ్డారు. స్థానికులు ‘చెరువు ఉన్న ఊరు గ్రామస్థులకే మొదట చేపలు ఇవ్వాలని’ డిమాండ్ చేశారు. పోలీసుల సాయంతో ఎట్టకేలకు చేపల చెరువు యజమాని విక్రయాలు ముగించాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!