CM KCR: మూడ్రోజుల పాటు ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన.. సెప్టెంబరు 2న TRS పార్టీ ఆఫీసుకు భూమిపూజ..
టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండున...
టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండున భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసిఆర్ ఒక రోజు ముండే ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇదిలావుంటే చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యాలయం నిర్మాణంతో పాటు మూడు రోజులు ఢిల్లీలోనే పర్యటన కొనసాగనుంది. కృష్ణానది జలాల పంపిణిపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనే ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్‌లో పలు సమస్యలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.
ఇక సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1న బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కానున్నారు. సెప్టెంబరు 2న దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ చేస్తారు.
ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేంద్రం 1,300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సెప్టెంబరు 2న మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా పాల్గొంటారు. తిరిగి సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వస్తారు.
ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..
నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..