AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Delhi Tour: ఈనెల 25న మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే భేటీకి హాజరు!

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.

CM KCR Delhi Tour: ఈనెల 25న మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే భేటీకి హాజరు!
Cm Kcr Delhi Tour
Balaraju Goud
|

Updated on: Sep 23, 2021 | 10:44 AM

Share

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ హోం శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్​అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి… రాష్ట్రం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా హోం శాఖ ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు.

ఇదిలావుంటే, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌, పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ లేఖలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆదివారం ఢిల్లీలో జరిగే హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పయనం అవుతున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశంముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇప్పటికే ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్.. మరోసారి హస్తిన పయనమవుతున్నారు. ఈ నెల 1న కేసీఆర్​ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజులపాటు అక్కడే ఉండిపోయారు. 2వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈనెల 3న ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్ర హోంమత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు.

Read Also…  Call Money: కాటేసిన ‘కాల్ మనీ’.. 10 వేల కోసం మహిళ ప్రాణాలు బలిగొన్న వడ్డీ వ్యాపారస్తులు..

Health Tips: భోజనం తర్వాత ఈ పనులు చేయొద్దని పెద్దలు పెట్టిన నియమాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసా..