Call Money: కాటేసిన ‘కాల్ మనీ’.. 10 వేల కోసం మహిళ ప్రాణాలు బలిగొన్న వడ్డీ వ్యాపారస్తులు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ మహిళ అసులుబాసింది. కేవలం 10 వేల రూపాయల అప్పు కోసం..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ మహిళ అసులుబాసింది. కేవలం 10 వేల రూపాయల అప్పు కోసం.. మహిళ ప్రాణాలు తీసుకునేలా చేశారు వడ్డీ వ్యాపారస్తులు. ఈ ఘటన చిత్తూరులో జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కేంద్రానికి చెందిన మహాలక్ష్మి కుమారుడు రూ. 10 వేలు అప్పు చేశాడు. వడ్డీ వ్యాపారి సుజాత వద్ద అతను ఆ డబ్బు తీసుకున్నాడు. అయితే, తీసుకున్న అసలుకు అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేశారు వడ్డీ వ్యాపారస్తులు. అయితే, అప్పు వెంటనే తీర్చాలంటూ మహాలక్ష్మిపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చింది వడ్డీ వ్యాపారస్తురాలు సుజాత. అప్పు తీర్చడం కోసం నానా మాటలు అన్నారు. అయితే, అధిక వడ్డీ చెల్లించలేక.. వడ్డీ వ్యాపారస్తురాలు సుజాత చేసిన అవమానం భరించలేక మహాలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే.. మహాలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. మహాలక్ష్మి మృతిపై కేసు నమోదు చేసుకున్నారు. వడ్డీ వ్యాపారి సుజాత వేధింపుల కారణంగానే.. మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Crime News: శ్రీశైలం మల్లిఖార్జనుడి దర్శకం కోసం వచ్చిన దంపతులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య
Viral Video: నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఊహించిన షాక్.!
PM Modi In Washington DC: అమెరికాలో మోదీకి ఘన స్వాగతం లైవ్ వీడియో