Crime News: శ్రీశైలం మల్లిఖార్జునుడి దర్శనం కోసం వచ్చిన దంపతులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. రెడ్ల సత్రం నీలం సంజీవరెడ్డి నిలయంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Crime News: శ్రీశైలం మల్లిఖార్జునుడి దర్శనం కోసం వచ్చిన దంపతులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య
Couple Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 23, 2021 | 10:00 AM

Couple Committed Suicide: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. రెడ్ల సత్రం నీలం సంజీవరెడ్డి నిలయంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకటేశ్వరరావు దంపతులు శ్రీశైలం మల్లిఖార్జునుడి దర్శనం కోసం వచ్చారు. ఈ క్రమంలో రెడ్ల సత్రం రూమ్ నెంబర్ 12లో దిగారు. అయితే, గురువారం ఉదయం చూసేసరికి దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు. ఇది గమనించిన సత్రం సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే, వారి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉడటంతో వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు చేరుకునేలోపే వెంకటేశ్వరరావు దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దంపతుల ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also….  MI vs KKR IPL 2021 Match Prediction: ముంబై సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..? బలమైన కోల్‌కతా ఎదుట నిలిచేనా..!