ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నంలో ఈ విషాదం..
Bhadradri Kottagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాల్వ రామారావు – మరియమ్మ దంపతుల కుమారుడు కాల్వ రాజ్ కుమార్ డిప్లొమో చదివాడు. ఇటీవల కొత్తగూడెం రుద్రంపూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించటంతో చర్చిలో వివాహం చేశారు. అయితే, పరీక్ష రాయటం కోసమని భార్య పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్థాపం చెందిన భర్త కాల్వ రాజ్ కుమార్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
పంచాయితీ ఉపాధ్యక్షురాలు సజీవ దహనం.!
తమిళనాడు రాష్ట్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాగశాల నుంచి నాణేలను తీసుకెళ్తున్న గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు సజీవదహనమయ్యారు. ఈ ఘటన మదురై జిల్లాలో జరిగింది. మేలూరు సమీపంలోని ఆలయ కుంభాభిషేకం యాగశాల నుంచి తీసుకెళ్తున్న నాణేలతో సంభవించిన మంటల్లో చిక్కుకొని పంచాయతీ ఉప సర్పంచ్ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మదురై జిల్లా మేలూరు సమీపం సాలైక్కిపట్టిలో ఉన్న వినాయకుడి ఆలయ కుంభాభి షేకం ఈనెల 14వ తేదీ జరిగింది. కుంభాభిషేకం సందర్భంగా ఏర్పాటుచేసిన యాగశాలలో ఉంచిన నాణేలు తీసుకెళ్లి ఇంట్లో వుంచుకుంటే కష్టాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ క్రమంలో.. మేల్‌మళవు యూనియన్ పంచాయతీ ఉపాధ్యక్షురాలు సంగీత మంగళవారం యాగశాలలో ఉంచిన 11 నాణేలను బ్యాగులో వుంచుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో బ్యాగులో ఉంచిన నాణేలు వేడిగా వుండడంతో మంటలు చెలరేగాయి. వాహనంపై ఒంటరిగా వెళుతున్న ఆమె మంటలు ఆర్పేందుకు వీలుపడక పోవడంతో, ఆమె శరీరం మొత్తం మంటలు అలుముకున్నాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి ఆమెను మదురైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక బుధవారం ఉదయం ఆమె మృతిచెందింది.
Read also: One Drive: జూబ్లీహిల్స్ ‘వన్ డ్రైవ్’ బాత్రూంలో సీక్రెట్ (స్పై) కెమెరా ఉదంతంలో కొత్త విషయాలు..