MI vs KKR IPL 2021 Match Prediction: ముంబై సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..? బలమైన కోల్‌కతా ఎదుట నిలిచేనా..!
Today Match Prediction of Mumbai Indians vs Kolkata Knight Riders: ఇప్పటి వరకు సరైన ప్రదర్శన ఇవ్వని ముంబై టీం.. కెప్టెన్ రోహిత్ లేకపోవడంతో టీం బలహీనంగా తయారైంది. మరోవైపు కోల్‌కతా టీం తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి ఊపులో నిలిచింది.
MI vs KKR: ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలివాల్సిందే. ఇప్పటి వరకు సరైన ప్రదర్శన ఇవ్వని ముంబై టీం.. కెప్టెన్ రోహిత్ లేకపోవడంతో టీం బలహీనంగా తయారైంది. మరోవైపు కోల్‌కతా టీం మాత్రం తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి ఊపులో నిలిచింది. ఇరు జట్లకు ఇక ఈ మ్యచ్ నుంచి ఎంతో కీలకంగా ఆడితేనే బరిలో నిలుస్తారు. లేదంటే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ఎనిమిది మ్యాచులాడి చెరో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబై టీం 4 వస్థానం, కోల్‌కతా టీం 6వ స్థానంలో నిలిచాయి.
డిఫెండింగ్ ఛాంపియన్‌లు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో నేడు తలపడబోతున్నారు. కోల్‌కతాపై గత సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేసిన వేదికపైనే ముంబై టీం తన లక్‌ను పరిశీలించుకోనుంది. గత ఏడాది ఒకే వేదికపై రెండుసార్లు సహా 28 ఐపీఎల్ ఎన్‌కౌంటర్లలో ముంబై టీం పై కోల్‌కతా టీం 22 సార్లు ఓడిపోయింది.
అయితే, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య లాంటి ఇద్దరు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహంగానే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్లేయంగ్ ఎలెవెన్‌లో చేరిన అన్మోల్‌ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీల టీంకు ఎలాంటి ఉపయోగం కలగలేదు. దీంతో నేటి మ్యాచులో ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఎవరుండనున్నారో ఆసక్తి రేపనుంది.
గత ఐదేళ్లలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన 12 మ్యాచ్‌లలో 1 మాత్రమే గెలిచిన ఇయోన్ మోర్గాన్ నాయకత్వంలోని జట్టు.. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ కంటే గట్టి సవాలును ఎదుర్కోనుంది. 2 సార్లు ఛాంపియన్ కోల్‌కతా టీం కేవలం 10 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి లీగ్ దశలో ద్వితీయార్ధంలో కేకేఆర్ ఇంకా ఎక్కువ మ్యాచుల గెలవాల్సి ఉంది.
ఆర్‌సీబీకి వ్యతిరేకంగా జట్టు కూర్పులో స్వల్పంగా మార్పలు చేసిన వ్యూహం బాగా పనిచేసింది. ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు, ముగ్గురు పేసర్‌లతో కేకేఆర్ టీం విజయవంతమైంది. అలాగే వారి బ్యాటింగ్‌కూడా బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా అరంగేట్ర ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ టీంకు ఎంతో బలాన్ని అందించింది. అయితే కోహ్లీ సేనపై చూపించిన ప్రదర్శన.. ముంబై టీంపై కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎప్పుడు: గురువారం, సెప్టెంబర్ 23, 2021 , రాత్రి 7:30 గంటలకు
ఎక్కడ: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
పిచ్: ఈ వేదిక వద్ద ఇతర జట్ల సగటు స్కోర్లు 155గా నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్ గత సీజన్‌లో సగటున 187 పరుగులు సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌లు మిగిలిన టీంల కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఎందుకో పాయింట్ల పట్టికలో వెనుకంజలోనే ఉండిపోతున్నారు.
ముంబై ఇండియన్స్: గాయాలు: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నేటి మ్యాచులో ఆడతారో లేదో ఇంకా డౌట్‌గానే ఉంది. అయితే తొలి ఆటలో ముందు జాగ్రత్త చర్యగా వారికి విశ్రాంతినిచ్చారని ట్రెంట్ బౌల్ట్ పేర్కొన్నాడు. జస్ప్రిత్ బుమ్రా, ఆండ్రీ రస్సెల్ నుంచి మంచి యార్కర్‌లు, షార్ట్ పిచ్ డెలివరీలతో ఆకట్టుకుంటున్నారు. వెస్టిండియన్‌పై జరిగిన 40 బంతుల్లో, అతను కేవలం 51 పరుగులు మాత్రమే ఇచ్చి, అతన్ని మూడుసార్లు అవుట్ చేశాడు.
ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
కోల్‌కతా నైట్ రైడర్స్: కోల్‌కతా టీంలో ప్రస్తుతానికైతే గాయాలు లేవు. టీంలో అంతా మంచి ఫాంలోనే ఉన్నారు. ముంబై ఇండియన్స్‌లో టాప్ -7 లో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నందున కేకేఆర్ హర్భజన్ సింగ్ లేదా కుల్‌దీప్ యాదవ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.
ప్లేయింగ్ XI: వెంకటేశ్ అయ్యర్, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి , నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ
మీకు తెలుసా? గత సీజన్‌లో రెండు గేమ్‌లలో కేకేఆర్ టీం ముంబై చేతిలో ఓడిపోయినప్పటికీ, అబుదాబిలో మాత్రం వారి రికార్డు చాలా మెరుగ్గానే ఉంది. ఇక్కడ ఆడిన 6 మ్యాచుల్లో 5 గెలించింది.
రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఒక జట్టుపై 1000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ కావడానికి 18 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ కేకేఆర్ టీంపై నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇది ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు. ఆ తరువాతి స్థానంలో మూడు అవార్డులతో సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యలు ఉన్నారు.
2013 నుంచి ఎంఐ టీం వారి సీజన్ తొలి మ్యాచును గెలవకపోయినా, గత ఆరు సీజన్లలో వారి ఆట తీరును పరిశీలిస్తే.. ఐదు సీజన్లలో ఎంఐ టీం వారి రెండవ మ్యాచ్‌లో గెలిచి తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. వీటిలో నాలుగు విజయాలు కేకేఆర్ టీంకి వ్యతిరేకంగా వచ్చినవే.
Also Read: IPL 2021: దూసుకుపోతున్న ఢిల్లీ.. చతికిలబడ్డ ఆర్సీబీ.. రేసులో చెన్నై, ముంబై.. వివరాలివే.!
ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!