Jangaon: ఓరి బుడ్డోడా.. ఎంత మాయగా డబ్బుల కట్ట కొట్టేశావ్‌రా..
పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని ఓ బుడ్డోడు చాకచక్యంగా జేబు కాళీ చేశాడు.. ఓ ఎల్ఐసి ఏజెంట్‌ను మైమరిపించి అతని జేబులో నుండి 50 వేల రూపాయల నోట్ల కట్ట కొట్టేశాడు.. ఆ బుడ్డోన్ని తక్కువ అంచనా వేసిన ఎల్ఐసి ఏజెంట్ సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు చూసి గుండెలు బాదుకున్నాడు..

ఈ ఘరానా దోపిడీ జనగామ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగింది.. దేవరుప్పుల మండలానికి చెందిన ఎలేందర్ ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి కార్యాలయంలో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చాడు.. తన జేబులో డబ్బులు పెట్టుకొని కౌంటర్ వద్ద డబ్బు లెక్కబెడుతున్నాడు.. అక్కడే తచ్చాడుతున్న ఓ బాలుడి కన్ను అతని జేబులోని కరెన్సీ కట్టపై పడింది.. ఏజెంట్‌ను మభ్యపెట్టి జేబులోని డబ్బంతా ఊడ్చుకుపోయాడు ఆ బాలుడు.
జేబులోని కరెన్సీ కట్ట దోపిడీకి గురైన తర్వాత అలర్ట్ అయిన ఎల్ఐసి ఏజెంట్ కాసేపు హైరానాపడి పరుగులు పెట్టాడు.. ఆ తర్వాత ఎల్ఐసి కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో సీసీ కెమెరాలు పరిశీలించి షాక్ అయ్యారు.. అక్కడే టచ్చాడుతున్న బాలుడు అత్యంత చాకచక్యంగా ఎల్ఐసి ఏజెంట్ జేబులోని 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయాడు… చోరీ దృశ్యాలు సిసి కెమెరాలు చూసి షాక్ అయిన ఎల్ఐసి ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పట బాలుడు ఎవరు అనేదానిపై పోలీసులు విచారణ జరుగుతున్నారు.
బాలుడి చేతివాటం వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..