Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రికి మహర్దశ.. అంతర్జాతీయ సొబగులు.. అధునాతన హంగులు

నిజాం కాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి.. సరికొత్త నయా హాస్పిటల్‌గా మారబోతుంది. అంతర్జాతీయ సొబగులతో.. అధునాతన హంగులతో.. కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ఉస్మానియాకు శుక్రవారం ఫౌండేషన్ స్టోన్ పడనుంది. ఆ డీటేల్స్ క్లియర్‌గా తెలుసుకుందాం పదండి....

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రికి మహర్దశ.. అంతర్జాతీయ సొబగులు.. అధునాతన హంగులు
Osmania Hospital
Follow us
Ram Naramaneni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 31, 2025 | 6:59 AM

హైదరాబాద్‌లో పెద్దాస్పత్రి అంటే మొదట గుర్తొచ్చేది ఉస్మానియా హాస్పిటల్. నిజాం కాలంలో దీనిని నిర్మించారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌ బిల్డింగ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. కొన్ని చోట్ల పెచ్చులూడిపడటం, డాక్టర్లు, స్టాఫ్ నిరసనలకు దిగడం సర్వ సాధారణమైంది. అంతేకాదు ఇరుకు రోడ్లు, సరైన వసతి సదుపాయం లేక రోగులు, సహాయకులు, హాస్పిటల్ స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కొత్త ఆస్పత్రి నిర్మాణానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. శుక్రవారం సీఎం రేవంత్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

పాత ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్ బిల్డింగ్ కావడంతో.. దానితో సంబంధం లేకుండా మరోచోట నిర్మించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. మొత్తం 26 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న గోషామహల్‌ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్.. లే-అవుట్ సిద్ధం చేసింది ప్రభుత్వం. సర్కార్ ప్రతిపాదించిన లే అవుట్ ప్రకారం.. మొత్తం 8 గేట్లు ఉండబోతున్నాయి. ఇందులో మూడువైపుల నుంచి ఆస్పత్రిలోకి ఎంటర్ అయ్యేలా మూడు గేట్లు ఉంటాయి. ఇవికాకుండా.. సర్వీస్‌ గేట్, మార్చురీ గేట్, హాస్టల్‌ గేట్, హాస్టల్&అకడమిక్ గేట్, అకడమిక్ గేట్ సపరేట్‌గా ఉన్నాయి.

హాస్పిటల్‌ భవనాల విషయానికి వస్తే.. మొత్తం 8 బ్లాక్‌లు ఉండబోతున్నాయి. 2వేల 500 కోట్లతో 14అంతస్థుల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మానియా హాస్పిటల్‌ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్త ఉస్మానియా ఆస్పత్రిని 30 డిపార్ట్‌మెంట్లు, 2వేల పడకలతో ఏర్పాటు చేయబోతున్నారు. నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలతో పాటు 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు. జీ+12గా బాయ్స్ హాస్టల్‌, ఫ్యాకల్టీ రెసిడెన్షి, గర్ల్స్‌ హాస్టల్ కూడా.. హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉండేలా డిజైన్ చేశారు.

ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఆపరేషన్ థియేటర్లు, ఆపరేషన్ థియేటర్‌‌కు అనుబంధంగా.. పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులకు డిజైన్ చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌‌లో అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పేషెంట్ అటెండెంట్ల కోసం ఆస్పత్రి ఆవరణలోనే ధర్మశాల నిర్మించబోతున్నారు. సెక్యూరిటీ కోసం రెండు పోలీస్ ఔట్ పోస్టులు, ఒక ఫైర్ స్టేషన్, ఒక సబ్ స్టేషన్ కూడా ఆస్పత్రికి సపరేట్‌గా నిర్మించబోతున్నారు. హాస్పిటల్ ముందు పార్కింగ్, ల్యాండ్ స్కేప్‌కు స్పేస్ ఇచ్చారు.

కొత్త ఆస్పత్రిలో రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు డిజైన్ చేశారు. మొత్తానికి కొత్త భవనం కావాలన్న.. డాక్టర్లు, ఉస్మానియా సిబ్బంది ఎన్నో ఏళ్ల కళ త్వరలో నెరవేరబోతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..