Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇన్ఫర్మేషన్‌ రావడంతో మాదాపూర్‌ పోలీసులు గుట్టుగా వెళ్లారు.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే మ్యాటర్‌

'వ్యభిచార గృహాలయందు ఈ వ్యభిచార గృహం తీరే వేరయా' అని చెప్పాలేమో..! ఇన్ఫర్మేషన్‌ రావడంతో మాదాపూర్‌ పోలీసులు గుట్టుగా వెళ్లి.. అక్కడి దందాను రట్టు చేశారు. ఎప్పటిలాగే.. విటులు, కొంతమంది యువతులను పట్టుకున్నారు. ఆ తరువాతే.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే మ్యాటర్‌ బయటపడింది. ప్రాస్టిట్యూషన్‌ కోసం వాళ్లు వాడుతున్న టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయారు.

Hyderabad: ఇన్ఫర్మేషన్‌ రావడంతో మాదాపూర్‌ పోలీసులు గుట్టుగా వెళ్లారు..  మైండ్‌ బ్లాంక్‌ అయ్యే మ్యాటర్‌
Prostitution (Representational Image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 30, 2025 | 10:07 PM

వ్యభిచార గృహంపై దాడులు.. విటులు, పలువురు యువతులు అరెస్ట్‌ అనే వార్త సాధారణంగానే వింటుంటాం. ఇక్కడా అదే జరిగింది. హైదరాబాద్‌ గౌలిదొడ్డి టీఎన్జీవోస్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి.. వ్యభిచార ముఠా గుట్టురట్టు అనే వార్త బయటికొచ్చింది. సాధారణంగా చూస్తే.. ఇది రొటీన్‌ వార్తే. కాకపోతే.. లోకల్‌, నేషనల్‌ లెవెల్‌ గర్ల్స్‌కు బదులు ఈసారి ఇంటర్నేషనల్‌ గర్ల్స్‌ పట్టుబడ్డారు ఈ రైడ్‌లో. ఇదీ రొటీన్‌ వార్తే అనుకుందాం కాసేపు. కాని, విటులను ఆకర్షించడానికి వీళ్లు వాడుతున్న టెక్నాలజీ ఏంటో తెలుసా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అట. మరి.. ఏ టూల్స్‌ వాడుతున్నారో, దాని ద్వారా విటులను ఎలా ఆకర్షిస్తున్నారో తెలీదు గానీ.. మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ చెబుతున్న దాని ప్రకారం.. ఈ గ్యాంగ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నారని చెబుతున్నారు.

హైదరాబాద్‌కు ఫారెనర్స్‌ రావడం, ఇక్కడే స్టే చేయడం కామన్. కాని, ఒక అపార్ట్‌మెంట్‌లోని రెండు పోర్షన్లలో ఏకంగా.. కెన్యా, టాంజానియా, ఉగాండా, బ్యాంకాక్ దేశాలకు చెందిన వాళ్లు ఒకేచోట ఉండడం కాస్త అనుమానాలకు తావిచ్చింది. అందులోనూ.. అందరూ అమ్మాయిలే. సో, ఆ అనుమానం ఇంకా బలపడింది. ప్రతిరోజు కొత్తకొత్త వ్యక్తులు అపార్ట్‌మెంట్‌కు వచ్చిపోతుండడంతో ఇక కన్ఫామ్‌ చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నామని నిర్వాహకులు అనుకున్నారు గానీ.. పోలీసులు పసిగట్టేశారు. టీమ్‌తో రైడ్‌ చేసిన మాదాపూర్ పోలీసులు.. 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేట్ హోమ్‌కు తరలించారు. మరో ఇద్దరు విటులు కూడా స్పాట్‌లో దొరికారు. అయితే ఈ వ్యభిచార ముఠాను నడిపిస్తున్న వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు.

ఈ దందా కోసం ఏఐతో పాటు టెలిగ్రామ్‌ యాప్‌ను కూడా తెగ వాడేశారు. ముందుగా.. ఈ ఫారెనర్స్‌ ఉండే అడ్రస్‌కు విటులు చేరుకునేందుకు టెలిగ్రామ్‌ యాప్‌లో లింక్‌ను షేర్‌ చేసేవాళ్లు. వాళ్లు అపార్ట్‌మెంట్‌కు చేరుకోగానే దాన్ని మాయం చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడేవాళ్లు. ఇలా గత మూడు నెలలుగా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోన్నట్టు గుర్తించారు. అయినా.. ఎదురుగా అంత మంది ఫారెనర్స్‌, అందులో ఇద్దరు విటులు కళ్లముందే కనిపిస్తున్నప్పుడు ఇక లింక్ మాయం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? హ్యుమన్ ట్రాఫికింగ్ ఫోర్స్‌, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు కలిసి ఈ ఆపరేషన్‌ చేసి.. ముఠాను మూయించేశారు. ఏదేమైనా.. టెక్నాలజీని ఈ లెవెల్‌లో వాడడం మాత్రం నిజంగా హైలెట్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..