Telangana Politics: మీ కుంటి సాకులకు జనం నవ్వుకుంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్..
Telangana Politics: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

Telangana Politics: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. సీఎం తీరు గర్హనీయం అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతంపై పలికారు. అయితే, ముఖ్యమంత్రి రావాల్సిన స్థానంలో మంత్రి రావడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు.
‘‘కేసీఆర్.. ఇదేనా మీ సంస్కారం? 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది? దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది? మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా? కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీ భాషను చూసి దేశమంతా అసహ్యించుకుంటుంటే ప్రధానికి ముఖం చూపించలేక తప్పించుకున్నావా? మీలాంటి వాళ్లు రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సిగ్గు చేటు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తారు.. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానిస్తారు.. మీ కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రధానిని అవమానించడమంటే దేశ ప్రజలను అవమానించినట్లే. మీ భాష, మీ సంస్కారం చూసి తెలంగాణ సభ్య సమాజం ఛీదరించుకుంటోంది. సీఎం పదవి పోయిన తరువాత మిమ్ముల్ని ఎవరూ పట్టించుకోరనే సంగతి గుర్తుంచుకోండి. అస్వస్థత కారణంగా రాలేదని కుంటి సాకులు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. మోదీ పేరు చెబితేనే కేసీఆర్ కు జ్వరం వచ్చినట్లుంది. భయపడి ముఖం చాటేసినట్లున్నారు.’’ అంటూ తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్దారు ఎంపీ బండి సంజయ్.
Also read:
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను వదల్లేక పోతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్ మీకోసమే..
Viral Photos: రష్యాలోని టెంబులాట్ ఎర్కెనోవ్ కోట చాలా ఫేమస్.. దీనిని ఒక వ్యాపారవేత్త నిర్మించారు..?
WATER PROBLEMS : తాగునీటికి కటకట.. రోడ్డు సౌకర్యమూ లేక విలవిల.. తీవ్ర ఇబ్బందుల్లో ఆ గ్రామ ప్రజలు
