WATER PROBLEMS : తాగునీటికి కటకట.. రోడ్డు సౌకర్యమూ లేక విలవిల.. తీవ్ర ఇబ్బందుల్లో ఆ గ్రామ ప్రజలు
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు(Water) లేకపోతే ఒక్క రోజూ జీవించలేం.

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు(Water) లేకపోతే ఒక్క రోజూ జీవించలేం. అటువంటి అత్యవసరమైన నీరు దొరకక ఓ ఊరు అల్లాడుతోంది. మంచి నీటిని తెచ్చుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ ఆ గ్రామ ప్రజలు కాలి నడకన ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఊళ్లో బోరు బావులు, చేతి పంపులు లేకపోవడంతో వారి కష్టాలు మరింత జటిలమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో గుంతలలో ఊరుతున్న కలుషిత నీటిని తాగి అనారోగ్యానికి గురవుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ బలరాంపూర్ జిల్లా(Balarampur) లోని సన్మంద్ర గ్రామస్థులు తాగు నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నీటి వసతి లేక గుంతలలో ఉబికి వస్తున్న నీటిని చిన్న పాత్రలలో నింపుకుని తాగుతున్నారు. ఈ నీటి కోసం కూడా ఊరికి దూరంగా ఉన్న కొండలు, గుట్టలు ఎక్కి తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్నారులను వీపున కట్టుకొని, బిందెలతో ఆ ఊరి మహిళలు రాళ్లు, చెట్లు దాటుకుంటూ నీటిని వెతుక్కుంటూ పయనమవుతున్నారు. ఇదే వీరి సమస్య అనుకుంటుండగా.. వారి గ్రామానికి రోడ్డు సౌకర్యమూ(Road facility) లేదు. కనీసం సరైన మట్టి రోడ్డూ ఏర్పాటు చేయలేదు. దీంతో వారికి కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. వారి రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించే నీటి కోసం సాయసయాత్రలు చేస్తున్నారు.
తమ గ్రామంలో మంచినీటి వసతి లేకపోవడంతో కలుషిత నీటిని తాగి అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సరైన రహదారి సౌకర్యమూ లేదని వాపోయారు. గతుకుల రోడ్డులో బాధితులను 5 కి.మీ. మేర తీసుకువెళ్లాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో అవసరమైన మంచినీటి బావులను తవ్విస్తామని, ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా కమ్యూనిటీ ట్యూబ్‌వెల్‌ను ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
Also Read
Twitter New Feature: ట్విట్టర్‌లో సరికొత్త పీచర్… అక్షరాల పరిమితికి ఇక హద్దులుండవ్..
Anasuya: ‘దర్జా’గా వస్తోన్న స్టార్ యాంకరమ్మ.. అనసూయ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా.?
IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్ శర్మ స్పష్టమైన సంకేతం..?



