AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: ‘దర్జా’గా వస్తోన్న స్టార్‌ యాంకరమ్మ.. అనసూయ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ చూశారా.?

Anasuya: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి బుల్లి తెర యాక్టర్‌గా, సినీ నటిగా పేరు దక్కించుకున్నారు అనసూయ. తనదైన చలాకీ మాటలు, అందంతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ సినిమాల ద్వారా వెండి తెర...

Anasuya: 'దర్జా'గా వస్తోన్న స్టార్‌ యాంకరమ్మ.. అనసూయ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ చూశారా.?
Narender Vaitla
|

Updated on: Feb 05, 2022 | 4:11 PM

Share

Anasuya: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి బుల్లి తెర యాక్టర్‌గా, సినీ నటిగా పేరు దక్కించుకున్నారు అనసూయ. తనదైన చలాకీ మాటలు, అందంతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ సినిమాల ద్వారా వెండి తెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. మొదట్లో చిన్న, చిన్న పాత్రలకు పరిమితమైన అనసూయ తాజాగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల పుష్పలో దాక్షాయణి పాత్రలో మెప్పించారు. నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపించి తన నటతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి నెగటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో అలరించనున్నారు అనసూయ.

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రలో తెరక్కుతోన్న చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో పిఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్‌ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో అనసూయ మరో పవర్‌ రోల్‌లో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. కారుపై చేతిలో కత్తితో కనిపించిన అనసూయ నటనకు ప్రాధాన్యత పాత్రలో నటిస్తోంది.

Anasuya Darja

దర్జా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన తర్వాత నిర్మాత నారాయణ మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే ఫస్ట్‌లుక్‌ కూడా ‘దర్జా’గా ఉంది. సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ.. అనసూయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా.. అనసూయ షూటింగ్‌కు వచ్చి సహకరించారంటూ తెలిపారు.

Anasuya

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సునీల్‌, అనసూయతో పాటు పృథ్వీ, షకలక శంకర్‌‌తో పాటు పలువురు నటించారు. రాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందించిన నీ సినిమాకు ఎమ్‌.ఆర్‌ వర్మ ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

Also Read: CBSE Term 2 Exams 2022: టర్మ్ 2 పరీక్షలకు శాంపిల్ ప్రాక్టీస్ పేపర్లను విడుదల చేసిన సీబీఎస్సీ! ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. మరోసారి ఎమ్మెల్యే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Botsa satyanarayana: ఆ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవు.. ఉద్యోగులతో చర్చలపై మంత్రి బొత్స వ్యాఖ్యలు