Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను వదల్లేక పోతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..

Instagram: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్నం తినకపోయినా కాసేపు ఆగుతున్నారు కానీ.. స్మార్ట్‌ఫోన్‌ను వదలలేకపోతున్నారు. దీనికి కారణం సోషల్‌ మీడియా. ఒక్క యాప్‌ ఓపెన్‌ చేస్తే చాలు..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను వదల్లేక పోతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 05, 2022 | 9:31 PM

Instagram: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్నం తినకపోయినా కాసేపు ఆగుతున్నారు కానీ.. స్మార్ట్‌ఫోన్‌ను వదలలేకపోతున్నారు. దీనికి కారణం సోషల్‌ మీడియా. ఒక్క యాప్‌ ఓపెన్‌ చేస్తే చాలు గంటల పాటు సోషల్‌ మీడియా విహరిస్తున్నారు. సమయాన్ని లెక్క చేయకుండా పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే అతి ఏదైనా అనర్థమే అన్నట్లు సోషల్‌ మీడియాను అతిగా ఉపయోగించడం వల్ల పలు అనర్థాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. టేక్‌ ఏ బ్రేక్‌ పేరుతో భారత్‌లో తాజాగా ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది ఇన్‌స్టాగ్రామ్‌.

ఒకవేళ యూజర్లు ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తున్నట్లయితే వెంటనే స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పై టేక్‌ ఏ బ్రేక్‌ పాప్‌ అప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే వెంటనే ఎంత సమయం బ్రేక్‌ తీసుకోవాలనే దానికి సంబంధించి సమయం కనిపిస్తుంది. ఈ అప్షన్‌ను సెలక్ట్‌ చేసకోగానే టేక్‌ ఏ డీప్‌ బ్రీత్‌, మీరు ఏం ఆలోచిస్తున్నారు.?, మీకు నచ్చిన పాటలు వినండి అంటూ సూచనలు ఇస్తుంది.

Instagram New Feature

ఇన్‌స్టాగ్రామ్‌ ఈ ఫీచర్‌తో పాటు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సేపు గడుపుతున్నారనేది తెలుసుకునేలా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో నిర్ణీత సమయం వరకే ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకునే లిమిట్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాన్‌ చేస్తోంది.

Also Read: LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్దరణకు అవకాశం

UP Elections: రసకందాయంలో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు.. యోగి భవితవ్యం తేల్చేది వారేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ప్రత్యక్షంగా కలుసుకోనున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్..