Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీబీజేపీ బిగ్ స్కెచ్, లోక్ సభ ఎన్నికల కోసం ‘హిందూత్వ’ ఎజెండా

లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా, హిందువులను ఆకట్టుకునే వ్యూహంలో ఈ సినిమాను రాజకీయ మైలేజీకి వాడుకోబోతోంది. ఈ సినిమాను బీజేపీకి చెందిన నాయకుడే గూడూరు నారాయణరెడ్డి నిర్మించడం విశేషం. ఈ చిత్రం గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల కావాల్సి ఉంది

టీబీజేపీ బిగ్ స్కెచ్, లోక్ సభ ఎన్నికల కోసం ‘హిందూత్వ’ ఎజెండా
Bjp Razakar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: TV9 Telugu

Updated on: Feb 12, 2024 | 5:15 PM

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీళ్ల సెంటిమెంట్ ఎత్తుకోగా, బీజేపీ పార్టీ మాత్రం హిందూత్వ ఎజెండా రాబోతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర2, వ్యూహం లాంటి సినిమాలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, తెలంగాణ బీజేపీ కూడా రజాకార్ సినిమాతో ఓట్లను రాబట్టుకునేందుకు సిద్ధమవుతోంది. 1948లో హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడం ఆధారంగా రజాకార్ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా, హిందువులను ఆకట్టుకునే వ్యూహంలో ఈ సినిమాను రాజకీయ మైలేజీకి వాడుకోబోతోంది. ఈ సినిమాను బీజేపీకి చెందిన నాయకుడే గూడూరు నారాయణరెడ్డి నిర్మించడం విశేషం. ఈ చిత్రం గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల కావాల్సి ఉంది. కానీ ఆలస్యమైంది.

గత ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించారు. అక్టోబరులో ప్రధాన ఎన్నికల అధికారి (CEO)కి లేఖ రాశాడు. ఇది మత విద్వేషాలను సృష్టించే ఉద్దేశ్యంతో చేయలేదని, చాలా మంది తమ సినిమాను వ్యతిరేకిస్తున్నారని విన్నవించారు. అంతేకాకుండా, భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు (KTR) 2023 సెప్టెంబర్‌లో అప్పటి BRS ప్రభుత్వం సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డుకు కంప్లైంట్ చేశాడు కూడా.

నిజాం కాలంలో ప్రజలపై జరిగిన మత హింస కారణంగా 26000 నుండి 40000 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం నియమించిన భూస్వామ్య భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, అణగారిన కులాలపై అణచివేత లాంటి అంశాలను ఈ సినిమాలో ఉన్నాయి. వీటి ఆధారంగా రజాకార్ సినిమా రూపుదిద్దుకుంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ 8 స్థానాలు గెలుచుకొని ఓటింగ్ శాతం పెంచుకుంది. ఇదే దూకుడుతో పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కనీసం సగం సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఈ క్రమంలో రజకార్ సినిమాతో బీజేపీ హిందుత్వ సెంటిమెంట్ తో ఓట్లు రాబట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి