Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు.. డీకే అరుణ సంచలన కామెంట్స్..!

Bjp vs Trs: వరిదాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం నాడు ఇక్కడ...

Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు.. డీకే అరుణ సంచలన కామెంట్స్..!
Dk Aruna
Follow us
Shiva Prajapati

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2021 | 7:21 PM

Bjp vs Trs: వరిదాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. నల్లగొండ జిల్లాలో వరి ధాన్యాల కొనుగోలు విషయంలో పర్యటించిన తమ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులే దాడి చేశారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగిందన్నారు. రాళ్ళతో గుడ్లతో దాడులు చేశారని ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలను జీర్ణించుకోలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు వినతిపత్రం అందించామన్నారు.

వరి దాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. దాడులతో రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వపంపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలల తరహాలనే స్థానిక నాయకులు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు బెట్టారని, ప్రజలను అనేక విధాలుగా మభ్య పెట్టారని, అయినా కూడా హుజురాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడుతాయన్నారు. కేంద్రం ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పిందని, అయిన కూడా రాష్ట ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చెయ్యడం లేదని డీకే అరుణ ఆరోపించారు. వెంటనే ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్న వరి ధన్యాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Also read:

Legal Notice To Suriya Jai Bhim: చిక్కుల్లో జై భీమ్.. రోజు రోజుకీ ముదురుతున్న వివాదం..(వీడియో)

Bandi Sanjay: బండి సంజయ్‌ పర్యటనలో మళ్లీ హైటెన్షన్.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు..

Hyderabad – BJP: రాజ్‌భవన్‌లో ఆసక్తికర సన్నివేశం.. ఈటలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన గవర్నర్.. !