Bandi Sanjay: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

కోకాపేట భూముల వేలంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. సర్కారు భూమిని హెచ్ఎండీఏ గజానికి లక్ష పదివేలకు అమ్ముతుంది.. అక్కడే గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారంటూ ఫైర్ అయ్యారు.

Bandi Sanjay: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 21, 2023 | 5:09 PM

కోకాపేట భూముల వేలంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. సర్కారు భూమిని హెచ్ఎండీఏ గజానికి లక్ష పదివేలకు అమ్ముతుంది.. అక్కడే గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారంటూ ఫైర్ అయ్యారు. దీని కోసమే కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకుని ప్రజలకు తెలియకుండా దాచాలనుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్.. మీ పార్టీకి మాత్రం భూములెలా వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఎంపి సోయం బాపురావు కుమారుడి వివాహానికి‌ హాజరైన బండి సంజయ్‌.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాయాలయాలకు కారు చౌకగా స్థలాలు కొట్టేని.. బీఆర్ఎస్ తీరుపై ఎన్నికల్లో తేల్చుకుంటామంటూ బండి సంజయ్‌ సవాల్ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి‌దోచుకునేందుకు ఎన్నికలకు‌ సిద్దమవుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు ‌కలిసి పోటీ చేస్తాయని జోష్యం చెప్పారు. కోకాపేట భూములను అప్పన్నంగా దోచుకునేందుకు‌ సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని.. తక్కువ ధరకు కాజేయాలని కుట్రలు‌ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బోయినిపల్లిలో ఇదే తరహాలో 10 ఎకరాలకుపైగా స్థలాన్ని కొట్టేసిందని.. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉందని ఆరోపించారు‌.

ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసిన తరువాత గజాల లెక్క రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల కోట్ల దందా చేస్తున్నారంటూ బండి ఆరోపించారు. కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలని.. లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు లీడర్లు పార్టీని వీడుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, ఒక సెక్షన్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..