- Telugu News Photo Gallery Cinema photos Who are the stars attend to the NTR 100 Years Celebrations in hyderabad photos
NTR 100 Years Celebrations Photos: ఒకే స్టేజిపై తళుక్కుమన్న తారలు.. ఆకాశమే హద్దుగా జరిగిన శతజయంతి వేడుకలు.
హైదరాబాద్ కైతలాపూర్ మైదానంలో శనివారం ఎన్టీయార్ శతజయంతి వేడుకలు అంబరాన్నంటాయ్. నందమూరి, నారా ఫ్యామీలల కోలాహాలం కనిపించింది. ఆకాశమే హద్దుగా జరిగిన ఈ వేడుకల్లో సినీ స్టార్స్ తళుక్కుమన్నారు.
Updated on: May 21, 2023 | 4:31 PM

హైదరాబాద్ కైతలాపూర్ మైదానంలో శనివారం ఎన్టీయార్ శతజయంతి వేడుకలు అంబరాన్నంటాయ్. నందమూరి, నారా ఫ్యామీలల కోలాహాలం కనిపించింది. ఆకాశమే హద్దుగా జరిగిన ఈ వేడుకల్లో సినీ స్టార్స్ తళుక్కుమన్నారు.

ఎన్టీఆర్ తెలుగు జాతికి సేవ చేయాలని పార్టీని పెట్టారన్నారు టీడీపీ చీఫ్ చంద్రాబాబు. ప్రతి ఒక్కరి తెలుగు గుండెలో యుగపురుషుడిగా నిలిచి పోయారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీయార్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు హీరో రామ్‌చరణ్.తొమ్మిదేళ్ల వయస్సులో ఎన్టీయార్‌ను తొలిసారి కలిశానని, ఎంతో ఆత్మీయతతో తనకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు రామ్‌చరణ్.

ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు జూ.ఎన్టీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. ఫ్యాన్స్ కూడా సందడి చేశారు. కానీ చివరాఖరుకు డుమ్మా కొట్టారు.

ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు చేసిన సేవ ఎంతో గొప్పదని నటుడు దగ్గుబాటి వెంకటేష్ అన్నారు. శత జయంతి వేడుకల్లో ఆ మహనీయుడిని తలచుకునే అదృష్టం రావడం గొప్ప విషయం అన్నారు. భౌతికంగా మన మధ్యలేక పోయినా ఆయన ప్రజల గుండెల్లో వున్నారని చెప్పారు. నా భాష తెలుగు అని చెప్పినప్పుడు వుండే గర్వం పేరే ఎన్టీఆర్ అన్నారు.

చిన్నప్పుడు ఎన్టీఆర్ ను చూసేందుకు ఎంతో ప్రయత్నించానని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తెలిపారు. ఓసారి ఫిల్మ్ ఫెస్టివల్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి స్వయంగా అందరికి స్వాగతం పలకడం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్ మూలస్థంభం అన్నారు నటుడు నాగ చైతన్య. ఆయన నటన, వాక్కు అద్భుతం అన్నారు. ఎన్టీఆర్ గురించి తన తాన ఏఎన్నార్ ఎంతో గొప్పగా చెప్పేవారన్నారు. కళకు , భాషకు ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ అంటే నూతన శకానికి ఆరంభం అని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి మకిలి అంటని రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ కీర్తి సంపాదించారని చెప్పారు.

సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వీరిద్దరూ నందమూరి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఈ జనరేషన్ కి చెందిన హీరోయిన్స్ లో శ్రీలీల ఒక్కటే ఉండటం విశేషం.దీంతో లక్కంటే శ్రీలీలదే, మాములు అదృష్టం కాదు కదా అని అందరూ శ్రీలీలను అభినందిస్తున్నారు. అంతమంది పెద్ద వాళ్ళ ముందు, స్టార్స్ ముందు ఒకే ఒక్క హీరోయిన్, అక్కడున్న వాళ్ళందరి కంటే ఏజ్ లో చాలా చిన్న అయినా శ్రీలీలకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం అనే చెప్పాలి.

సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వీరిద్దరూ నందమూరి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.