Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఆ పోలీస్ స్టేషన్

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మాటేమో కానీ... ఆ ఠాణావైపు కన్నెత్తి చూడాలంటేనే ఖాకీలు షేక్‌ అవుతున్నారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన రక్షక భటనిలయంలో పోలీసులకే భద్రత కరువు అవుతుందా? ఆ PS కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారంటే ఇక అంతే సంగతులు. పోస్ట్‌ ఊస్టింగే. ఒకరో ఇద్దరో కాదు కొన్నాళ్లుగా సీఐ, ఎస్‌ఐ సహా కానిస్టేబుళ్లపై బదిలీ వేటు..సస్సెన్షన్‌ కాటు షరామాములయ్యాయి.అంతేకాదు రీసెంట్‌గా ఎస్‌ఐ ఆత్మహత్య సంచలనం రేపింది. అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌కు మరక మీద మరక వెనక అసలు కతేంటి?.

Telangana: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఆ పోలీస్ స్టేషన్
Aswaraopet Police Station
Follow us
N Narayana Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 08, 2024 | 8:18 PM

కల్కీ సినిమాతో ఇప్పుడు ఎక్కడ చూసిన అశ్వత్తామ పేరే విన్పిస్తోంది.అదేం చిత్రమో కానీ అశ్వరావు పేట ఠాణా పేరెత్తితే ఖాకీలే షేకవుతున్నారు. ఎందుకని? అనేది ఇప్పుడో చర్చగా మారింది. భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నిత్యం వివాదాలుగా మారుతుంది,  సమన్వయ లోపం, అధికారుల చేతివాటంతో పాటు కొందరు అధికారుల ప్రవర్తనా తీరుతో పోలీస్ స్టేషన్ పరువు రోజు రోజుకూ దిగజారి పోతోంది. చివరికి అభాగ్యులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పవలసిన ఎస్సై శ్రీను ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు సుమారు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ పనిచేసిన ఎందరో అధికారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ గత రెండు మూడు సంవత్సరాల కాలంలో అవినీతి పోలీస్ స్టేషన్ గా మారింది, లంచాల రుచి మరిగిన కొందరు అధికారులే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

పై స్థాయి, క్రింది స్థాయి సిబ్బంది మధ్య అవగాహణలోపం, అంతర్గత కలహాలు, అవినీతికి అలవాటు బడి రక్షకభట నిలయాన్నిఅవినీతి నిలయంగా మార్చారు. కనీసం రెండు సంవత్సరాలు కాలం పనిచేయాల్సిన అధికారులు 6 నెలలు,సంవత్సర కాలంలోనే  అవినీతి మరకలు అంటించుకొని ,ముగ్గురు సి ఐ ల, ముగ్గురు ఎస్.ఐ ల పనిష్మెంట్లు, ట్రాన్సఫర్లు జరిగాయంటే  క్రమ శిక్షణకు మారుపేరుగా ఉండే ఈ పోలిస్ స్టేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

గత మూడు నాలుగేళ్లలో   అశ్వారావుపేట పీఎస్‌లో  కొందరు అధికారుల నిర్వాకం సంచలనం రేపింది. పేకాట రాయుళ్ల నుంచి లంచం తీసుకున్న వైనాలు కలకలం రేపాయి.బాధ్యులుగా కొందరిపై  చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. కానీ గత 5 నెలల క్రితం ఎస్.ఐ గా,విధుల్లో చేరిన శ్రీరాముల.శ్రీనివాస్  ఆత్మహత్య  విషాదాన్ని మిగిల్చింది.

ఎస్‌ఐ శ్రీరాములు శ్రీనివాస్‌ సూసైడ్‌ కేసులో    నలుగురు కానిస్టేబుళ్లు ను ఎస్.పి ఆఫీస్ కు అటాచ్ చేశారు. , సి.ఐ జితేందర్ రెడ్డి ని, ఎ  వరంగల్  ఐ. జి ఆఫీస్ కు అటాచ్మెంట్ చేశారు…వీరిపై ఎస్ ఐ భార్య పిర్యాదు మేరకు మహబూబాబాద్ పి ఎస్ లో కేసు నమోదు అయ్యింది.

అవినీతి,రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులకు,సామాన్యులకు అన్యాయం జరుగుతుందని,నిష్పక్షపాత విధుల నిర్వహణ,శాంతిభద్రతల పర్యవేక్షణ,నేరాల నియంత్రణ వాటి కంటే ,సంపాదనకు, రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ విధంగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ అప్రదిష్ట పాలయందని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..