Telangana Assembly: 30శాతం కమీషన్లు..! ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. అసెంబ్లీలో దుమ్ముదుమారం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు నిరూపించాలంటూ కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరూపించలేకపోతే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ భట్టి హెచ్చరించారు. దోచుకుంది మీరు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే అంటూ బీఆర్‌ఎస్ నేతలపై భట్టి మండిపడ్డారు. కాగా.. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో.. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
ధరణి వర్సెస్ భూ భారతి.. భట్టి కీలక వ్యాఖ్యలు..
ధరణి, భూ భారతిపై కూడా తెలంగాణ అసెంబ్లీలో రచ్చ జరిగింది. ధరణిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇంకా అదే చట్టాన్ని అమలుచేస్తున్నారు. ధరణిలో వివరాల ఆధారంగానే ఇప్పటికీ ప్రభుత్వ పథకాల అమలు జరుగుతుందని.. పైగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతిలో అనేక లోపాలు ఉన్నాయన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఈ వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధరణి ఓ దుర్మార్గమైన చట్టమంటూ డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు.
పార్ట్-బీ పేరుతో భూములు దోచుకున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్యమాలతో వచ్చిన చట్టాలను ఒక్క కలంపోటుతో వెనక్కు తీసుకెళ్లారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఎన్నికల్లో చెప్పాం .. చెప్పినట్టుగానే భూ భారతిని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..