ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో.. ఎలా కట్టాలో తెలియదు.. శిక్ష తప్పించుకోవాలని చూస్తున్నారుః కోమటిరెడ్డి
మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది.. తప్పు చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో లఘుచర్చ జరిగింది. ఇందులో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు మధ్య వాడివేడి చర్చ సాగింది.

కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో.. ఎలా కట్టాలో వారికి తెలీదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా కట్టింది కాబట్టే మీరు కట్టిన ప్రాజెక్ట్ మీ హయాంలోనే కూలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ సబ్జెక్ట్‌పై మాట్లాడాలని సూచించిన ఆయన.. సభను డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేయడం సరికాదని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షనేత కేసీఆర్ శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్ట్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను క్వాష్ చేయాలనే కోర్టుకు వెళ్లామని హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో చర్చించవద్దని మేం కోర్టుకు వెళ్లలేదన్నారు. కాళేశ్వరం అద్భుతమని గతంలో కోమటిరెడ్డి చెప్పారని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..