AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ కావాలా..? సీబీసీఐడీ కావాలా..? ఏ విచారణ కావాలో తేల్చుకోండిః సీఎం రేవంత్ రెడ్డి

అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.

సీబీఐ కావాలా..? సీబీసీఐడీ కావాలా..? ఏ విచారణ కావాలో తేల్చుకోండిః సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy On Kaleswaram
Balaraju Goud
|

Updated on: Aug 31, 2025 | 8:32 PM

Share

అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ప్రాణహిత చేవెళ్లలో నీరు అందుబాటులో ఉంది. హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని ఆనాటి కేంద్ర మంత్రి ఉమా భారతి అక్టోబర్ 24, 2014 న స్పష్టంగా చెప్పారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. 205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని లెటర్ రాస్తే.. హరీష్ రావు మళ్లీ పరిశీలించాలని మళ్లీ లేఖ రాశారన్నారు. బీఆర్ఎస్ నేతల తప్పుడు విధానాలతో మళ్లీ పరిశీలించాలని లేఖ రాశారని సీఎం తెలిపారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్నాక మళ్లీ పరిశీలించాలని ఎవరైనా అడుగుతారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

2009 లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందుబాటులో ఉందని అనుమతి నిచ్చిందన్నారు. ఈ రికార్డులను కావాలనే ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో వాస్తవాలని బయటపెట్టారనే వారిపై విషం చిమ్ముతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. హరీష్ రావు తప్పు చేశారని నివేదికలోని పేజీ నెంబర్ 98 లో స్పష్టంగా పొందుపరిచారని ముఖ్యమంత్రి వివరించారు. సీబీఐ కావాలా, సీబీ సీఐడీ కావాలా ఏ విచారణ కావాలో చెప్పకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కోరారు.

హరీష్ రావు చెప్పిన అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారని, ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్టుగానే భావిస్తున్నారన్నారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించకుండా.. పేరు మార్చి ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని సీఎం రేవంత్ ఆరోపించారు. 2014 లో నీరు అందుబాటులో ఉందని చెప్పిన విషయం దాచి 13 మార్చి 2015 న ఉమా భారతి లేఖను పట్టుకుని హరీష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యాసాగర్ రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాళేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునేవారన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు. నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్, హరీష్ ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని నియమించారని సీఎం అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక వారికి అనుకూలంగా లేదని ఆ నివేదికను తొక్కిపెట్టి వాళ్లు అనుకున్న చోట ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. వీళ్ల ఉద్దేశమే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం.. వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణ తెచ్చుకున్నామన్న సీఎం రేవంత్.. ఏనుగులను తినేవాళ్లు పోయారనుకుంటే పీనుగులను తినేవాళ్లు వచ్చారన్నారు. ఇప్పటికీ హరీష్ రావు మొండి వాదనకు దిగుతున్నారు. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా దురుద్దేశ పూర్వకంగా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఘోష్ కమిషన్ నివేదికలో పేజీ నెంబర్ 63 లో స్పష్టంగా చెప్పారన్నారు. నిపుణుల కమిటీ విచారణలో తన మామ, బావమరిది చేశారని హరీష్ రావు తన నిస్సహాయతను ఒప్పుకున్నారని 65వ పేజీలో స్పష్టంగా ఉంది. అందుకే నివేదికపై చర్చ జరగకుండా హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఏ విధమైన విచారణ చేపట్టాలో హరీష్ రావు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..