AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాకాసి దారం.. దొరికితే డైరెక్ట్‌గా మర్డర్ కేసే.. ఇప్పటివరకు ఎన్ని ఫైల్ చేశారో తెలుసా..?

యమపాశాన్ని కళ్లారా చూశారా ఎప్పుడైనా. అదిగో.. ఎగురుతోంది పతంగిని పట్టుకుని 'మాంజా' పేరుతో...! అది మనుషులకే కాదు పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పే..! అందుకే చైనా మాంజాపై సీరియస్‌ యాక్షన్‌ షురూ చేశారు నిజామాబాద్ పోలీసులు.. ఇప్పటివరకు ఎన్ని ఫైల్ చేశారో తెలుసుకోండి..

Telangana: రాకాసి దారం.. దొరికితే డైరెక్ట్‌గా మర్డర్ కేసే.. ఇప్పటివరకు ఎన్ని ఫైల్ చేశారో తెలుసా..?
China Manja
Shaik Madar Saheb
|

Updated on: Jan 16, 2026 | 8:52 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది. వరుస ప్రమాదాలతో టెర్రర్ పుట్టిస్తోంది. నిన్నటిదాకా మాంజా తాడు చుట్టుకుని, దారినపోయేవాళ్లను ఆస్పత్రిపాలు చేసింది. ఇప్పుడు మాంజా దారం మృత్యుపాశమే అయ్యింది. మాంజాతో తెలంగాణలో ఇప్పటివరకు ఒకరు చనిపోగా… పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు అహ్మదాబాద్‌, కర్నాటకలోనూ ఇద్దరి చనిపోయారు. కర్నాటక తలమదగిలో బైక్‌పై వెళ్తున్న సంజు కుమార్‌, అహ్మదాబాద్‌ జుహాపురాలో మరో యువకుడి గొంతు కోసిందీ రాకాసి దారం.. దీంతో వారిద్దరూ మరణించారు.

చైనా మాంజా- ప్రాణాల మీదకు తెస్తున్న వేళ నిజామాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజా అమ్మితే కనీవినీ ఎరుగని రీతిలో పెద్దఎత్తున కేసులు పెడుతున్నారు. చైనా మాంజా విక్రయించినవారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం ఐదుగురిపై కేసులు ఫైల్ చేశారు. 50కి పైగా చైనా మాంజా బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాదు… చైనా మాంజాలు కొని ఎగరేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు. కాసింత వినోదం .. జీవిత కాల విషాదాన్ని నింపుతోందని అవగాహన కల్పిస్తున్నారు. చైనీస్ మేడ్ మాంజాల్ని వాడితే అవి డెడ్లీ కైట్స్ ఔతాయ్, వాటిని అమ్మకండి కొనకండి అని అన్నిరకాలుగా అవేర్‌నెస్‌ తెస్తున్నారు. ఇటు వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఖాళీగా ఉన్నాయని రోడ్లపై స్పీడుగా వెళ్లొద్దంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..