AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..!! ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా వచ్చేసిందా.?

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మించారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ధనుష్ .

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..!! ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా వచ్చేసిందా.?
Danush
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2026 | 9:18 AM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ధనుష్. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లక్రితం ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇటీవలే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో హిట్ అందుకున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అంతకు ముందు సార్ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు ధనుష్.

మొన్నామధ్య ధనుష్ భార్య నుంచి విడిపోయిన విషయం తెలిసిందే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ధనుష్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరోయిన్ ను ధనుష్ పెళ్లాడనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.

ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మొన్నీమధ్య మృణాల్ బర్త్ డే పార్టీలో ధనుష్ కనిపించాడు. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధనుష్ సిస్టర్స్‌ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది మృణాల్. దాంతో డేటింగ్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లి డేట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వచ్చేనెల 14న మృణాల్, ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీని పై ధనుష్, మృణాల్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి దీనిపై ధనుష్, మృణాల్  ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది