కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముంది? 665 పేజీల రిపోర్ట్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది?
కాళేశ్వరం నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో లోపాలున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని నివేదికలో వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగిందని. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మూడు బ్యారేజీలలో భారీగా డ్యామేజ్ జరిగిందని తెలిపింది.

కాళేశ్వరం నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో లోపాలున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని నివేదికలో వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగిందని. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మూడు బ్యారేజీలలో భారీగా డ్యామేజ్ జరిగిందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయిందని ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది.
సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారంది కమిషన్. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ నిర్మాణం జరిగిందని తేల్చింది కమిటీ. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇతర అంశాలపై కేబినెట్ అప్రూవల్ తీసుకోకపోవడం నిబంధనలకు విరుద్ధమే అవుతుందని తెలిపింది. భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదని తెలిపింది. భద్రతా ప్రమాణాలను పాటించలేదని ఘోష్ నివేదిక తేల్చింది. పనుల పర్యవేక్షణలో లోపాలున్నాయని వెల్లడించింది.
బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదని నివేదికలో తెలిపింది పీసీఘోష్ కమిషన్. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజా ధనం దుర్వినియోగం చేశారంది కమిషన్. ప్రాజెక్టు ఖర్చు 38 వేల 500 కోట్ల నుంచి 1.10 లక్షల కోట్లకు పెరిగిందని వివరించింది కమిటీ. పెరిగిన అంచనాలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వేల కోట్లు ఖర్చయినా ప్రజలకు పూర్తిస్థాయిలో లాభం జరగలేదని తెలిపింది పీసీ ఘోష్ కమిషన్
కేంద్ర జల సంఘం సూచనలు పట్టించుకోలేదని కమిషన్ తెలిపింది. వాప్కోస్ రిపోర్ట్‌కు ముందే ప్రాజెక్టును నిర్మించారంది. నీటిపారుదల అధికారులు బాధ్యత నుంచి తప్పించుకున్నారంది. ఇంజినీర్లు భద్రతా అంశాలు తెలియదని ఒప్పుకున్నారని తెలిపింది. ఖర్చులు – పనుల మధ్య భారీ తేడాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఫౌండేషన్ బలహీనత వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని వివరించింది. అన్నారం బ్యారేజీకి నాసిరకం కాంక్రీటు వాడారని తెలిపింది. సుందిళ్ల భద్రతా పరీక్షలు లేకుండా పనులు పూర్తి చేశారని నివేదికలో వెల్లడించింది. రాజకీయ జోక్యం, పరిపాలనా నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ దెబ్బతిన్నట్టు వివరించింది
బాధ్యులపై చర్యల విషయంలో ఎలాంటి సిఫారసులు చేయలేదు కమిషన్. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే దర్యాప్తు చేశాయని తెలిపింది కమిషన్. NDSA తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వివరించింది కమిషన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
