Harish Rao: సభలో చర్చ వద్దని మేం చెప్పలేదు: హరీశ్ రావు
660 పేజీల నివేదికపై అరగంటలోనే అన్నీ మాట్లాడాలంటే ఎలా? హరీశ్ రావు సభలో ప్రశ్నించారు. చర్చకు రెండుగంటల సమయం ఇవ్వాలని.. మధ్యలో జోక్యం చేసుకోవద్దని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగిందా? లేదా? తేలాలన్నారు. నివేదికను రద్దు చేయాలనే కోర్టుకు వెళ్లాం కానీ.. అసెంబ్లీలో చర్చించవద్దని కోరలేదని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో హరీశ్ రావు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 660 పేజీల నివేదికపై అరగంటలో చర్చ సాధ్యమా? అని ప్రశ్నిస్తూ.. కనీసం రెండుగంటల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాజకీయ ప్రేరణతో తయారైన డొల్ల రిపోర్టుగా అభివర్ణించారు. 8బి నోటీసుల్లేకుండా నివేదిక ఇవ్వడం చట్ట విరుద్ధం అని, సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. కోర్టుకు వెళ్లడం రాజ్యాంగ హక్కు అని చెబుతూ, నివేదికను రద్దు చేయాలనే కోర్టును ఆశ్రయించామని తెలిపారు. సభలో చర్చ వద్దని ఎప్పుడూ చెప్పలేదని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Published on: Aug 31, 2025 07:32 PM
వైరల్ వీడియోలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

