AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ!

కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ!

Samatha J
|

Updated on: Jan 15, 2026 | 12:50 PM

Share

కర్నాటకలోని గదగ్‌ జిల్లా లక్కుండి అరకేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా రాగి బిందెలో సుమారు కేజీ వరకు బంగారం దొరికింది. అది నిధి అని భావించిన కుటుంబసభ్యులు జిల్లా అధికారులకు అప్పగించారు. పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యుల పంట పండించే మాట చెప్పారు. ఆ ఇంటి ఆవరణలో దొరికినది నిధి కాదని, ఆ ఇంటి పూర్వీకులు దాచిన బంగారం అని తేల్చి చెప్పారు. ఆ బంగారం పురాతన నిధి కిందకు రాదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులు, బంగారం దొరికిన ఇంటి వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. తమ బంగారం తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిధి దొరికిన తర్వాత కుటుంబసభ్యులు దాన్ని జిల్లా అధికారులకు మనస్ఫూర్తిగా అప్పగించారు. బంగారం తిరిగి ఇవ్వడానికి ఎలాంటి పేచీ పెట్టలేదు. ఆ బంగారం వారి పూర్వీకులది అని తేలటంతో వారు దాన్ని తిరిగి అడుగుతున్నారు. గ్రామస్థులు కూడా బంగారాన్ని కుటుంబసభ్యులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారుల స్టేట్‌మెంట్ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆ బంగారాన్ని కుటుంబసభ్యులకు తిరిగి ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులూ ఎంతో ఆసక్తిగా నిధి వెనక్కు వస్తుందా? లేదా అని ఎదురుచూస్తూ ఉన్నారు.లక్కుండి గ్రామంలో ఇంటి కోసం పునాది తీస్తుండగా గుప్తనిధి బయటపడింద. గంగవ్వ బసవరాజ్ రిత్తి ఇంటి స్థలంలో నిధి దొరికింది. ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకె బిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అవి దాదాపు ఒక కిలో బరువు ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ఇలా దొరికిన వస్తువులు ప్రభుత్వానికే చెందుతాయి. కానీ ఆ బంగారం.. ఇంటి పూర్వీకులదేనని తేలడంతో ఆ పుత్తడిని కుటుంబసభ్యులకు తిరిగి ఇస్తారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది.